• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోటి దూల: మైకుంది కదా అని వాగాడు... ఆ తర్వాత అడ్డంగా బుక్కైపోయిన బీజేపీ నేత

|

అనవసరం అనుకున్న చోట తలదూరిస్తే ఫలితాలు చేదుగానే ఉంటాయన్న విషయం ఓ బీజేపీ నేత విషయంలో సరిగ్గా సూట్ అయ్యింది. వందేమాతరంలాంటి జాతీయగేయంను సరిగ్గా పాడరాని వారికి ప్రాంతీయపార్టీలు అభ్యర్థులుగా నిలబెడుతున్నాయని నిప్పులు చెరిగారు మొర్దాబాద్ బీజేపీ కార్యకర్త శివం అగర్వాల్. అయితే ఇదే తనకు బ్యాక్ ఫైర్ అవుతుందని ఊహించలేకపోయాడు పాపం.

బీజేపీ సంకల్ప్‌ ర్యాలీలో పాల్గొనేందుకు శివం అగర్వాల్‌కు వీవీఐపీ పాస్ ఉంది. ఇక ప్రసంగాలు చేస్తూ ప్రాంతీయ పార్టీలు దేశభక్తి లేని నాయకులను కనీసం జాతీయ గేయం పాడరాని నేతలను బరిలోకి దింపిందంటూ ధ్వజమెత్తారు. అదే వందేమాతరం గేయాన్ని తనను పాడమని చెప్పగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎప్పుడైతే మీడియా వారు ఈ ప్రశ్న అడిగారో వెంటనే తన ఫోన్‌ను తడుముకుంటూ అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. అసలు విషయం ఏమిటంటే నీతులు చెప్పిన శివం అగర్వాల్‌కు కూడా వందేమాతరం పాడటం రాదు. ఇక వందేమాతరం పాట పాడమని అడిగినప్పుడు శివం అగర్వాల్ ముఖం చిన్నబోయింది.

BJP party worker stumped when asked to sing National song

ఇక విలేఖరులు పదేపదే వందేమాతరం పాడాల్సిందిగా ఒత్తిడి తీసుకురాగా.. ఫోన్ వస్తోందని చెప్పి తప్పించుకునే ప్రయత్నంచేశాడు. ఇక ఎలాగైనా ఇరికించాలని భావించారో ఏమో తెలియదు కానీ.. కనీసం జాతీయ గీతం జనగణమణ పాడాల్సిందిగా కోరారు. దీనికి కూడా ఈ బీజేపీ నేత బిక్క చూపులు చూశాడు. అంటే జనగణమణ కూడా అతనికి రాదని తేలిపోయింది.

మొత్తానికి పేరుకు మాత్రమే పార్టీల్లో తిరుగుతున్న నేతలు అధికారం ఉందికదా అని ఎక్కడపడితే అక్కడ నోరుజారితే ఇదిగో ఇలానే శివం అగర్వాల్‌లా ఉంటుంది పరిస్థితి. అసలు తనకే తెలియనప్పుడు అధికారం ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకోవడం పొరపాటవుతుందని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A BJP worker in Uttar Pradesh's Moradabad on Monday slammed regional political parties for fielding candidates who allegedly disrespected India's national song, Vande Mataram. What followed his comment was not only comical but also left the individual embarrassed.When the young BJP worker Shivam Aggarwal was asked to sing the national song, he was left stumped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more