చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మరణంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న బిజెపి

తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ఇదే సరైన అవకాశమని బిజెపి పావులు కదుపుతోంది. జయ తర్వాత ఎఐఎడిఎంకెలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరూ లేరు. దీంతో బిజెపి నాయకులు తమ ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణించిన తర్వాత పార్టీని సమర్థవంతంగా నడపడం సాధ్యమేనా, అనే చర్చ సాగుతోంది. అయితే ఈ అవకాశాన్ని తీసుకొని తమిళనాడులో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు బిజెపి పావులు కదుపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ఇదే అవకాశంగా బిజెపి భావిస్తోంది.

జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడులో ప్రాబల్యం కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

అయితే జయలలిత సిఎంగా ఉన్న కాలంలో ఆమెతో ఆ పార్టీ సన్నిహిత సంబంధాలను ఏర్పాటుచేసుకొంది.జయలలిత ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్యంపై బిజెపి నాయకులు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహ పలువురు బిజెపి అగ్రనేతలు ఆమెకు అందుతున్న వైద్యసేవలపై తరచూ డాక్టర్లతో చర్చించేవారు. కొందరు కేంద్రమంత్రులు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి ఆమె ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు.

ఎఐడిఎంకెలో జనాకర్షక నేతలెవరు

ఎఐడిఎంకెలో జనాకర్షక నేతలెవరు

ఎఐడిఎంకెలో ఎంజిఆర్ తర్వాత జయలలిత జనాకర్షణ గల నాయకురాలిగా ఎదిగారు. ఎంజిఆర్ బతికున్న కాలంలోనే ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఆమె పార్టీలో ప్రవేశాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. అయితే ఎంజిఆర్ మాత్రం ఆమెకు మద్దతిచ్చేవారు. ఎంజిఆర్ మరణం తర్వాత కొంత ఇబ్బందిపడింది జయలలిత.1989 లో ప్రతిపక్ష నాయకురాలిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1991 నుండి చనిపోయేవరకు పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.అన్నీ తానై పార్టీని ఆమె నడిపించారు. అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పాలన పగ్గాలను ఆమె పన్నీరు సెల్వం కు అప్పగించారు. ఆస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే సెల్వం ఆమె స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించారు.జయలలిత స్థాయిలో జనాకర్షణ కల నాయకుడు పార్టీలో లేరు. ఈ పరిస్థితి పార్టీకి కొంత ఇబ్బందే.

 పార్టీలో నెంబర్ 2 లేరు

పార్టీలో నెంబర్ 2 లేరు

పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో ఆమె తర్వాత స్థానం అనే విషయమై ఇంతవరకు చర్చే జరగలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె తర్వాతి స్థానం కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఈ పరిణామం పార్టీకి కొంత ఇబ్బందులను కల్గించే అవకాశం లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అన్నీ విషయాలను తాను సమర్థవంతంగా నడిపారు. అందుకే ఆమె జైల్లో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్న ఆమె తర్వాత స్థానం విషయమై పార్టీ నాయకుల్లో పెద్దగా చర్చ సాగలేదు. ఎంజిఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ సిఎంగా బాధ్యతలను నిర్వహించినా పార్టీపై పట్టును సాధించలేకపోయారు.1991లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. సీనియర్లను కూడ తన అదపులో ఉండేలా చేశారు. పార్టీలో తాను చెప్పిందే వేదంగా మారేలా వ్యూహాన్ని అమలుచేశారు. పార్టీలో నెంబర్ 2 అనే స్థానం ఉంటే పార్టీ పురోభివృద్ధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి ఆమె నెంబర్ 2 స్థానాన్ని ప్రోత్సహించలేదు.

 జయకు పన్నీర్ విధేయుడు

జయకు పన్నీర్ విధేయుడు

అనివార్య పరిస్థితుల్లో జయలలిత జైలుకు వెళ్ళిన సందర్భాల్లో తన వారసుడిగా జయలలిత పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సమంలో కూడ తాత్కాలిక ముఖ్యమంత్రిగా సెల్వం బాధ్యతలను నిర్వహించారు. అయితే .జయచనిపోయిన తర్వాత పన్నీరు సెల్వం ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.జయతో ఎప్పుడూ నీడలా ఉండే శశికళ కూడ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేవారు కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ ఆమె ఆరోగ్యం అంతగా బాగా లేకున్నా ఆమె మాత్రం బాధ్యతలను ఇతరులకు అప్పగించలేదు.ఒంటిచేత్తో వరుసగా రెండోసారి అధికారపీఠాన్ని అధిరోహించారు.

 బిజెపి వ్యూహాలు

బిజెపి వ్యూహాలు

తమిళనాడు రాష్ట్రంలో బిజెపి ప్రాబల్యం పెంచుకొనేందుకు గాను బిజెపి ఈ అవకాశాన్ని తీసుకోనుంది. దక్షిణాదిలో ఆ పార్టీకి అంతగా ప్రాబల్యం లేదు. అయితే తమిళనాడులో జయలలిత మరణంతో ఆ పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఎవరూ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారింది.అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకొని బిజెపి ప్రాబల్యం కోసం ఎత్తులు వేస్తోంది.బిజెపి నాయకులు కూడ పన్నీరు సెల్వం తో సన్నిహితంగా ఉంటారు.

English summary
bjp planned to strong in tamilnadu state.no popular leader in aiadmk party after jaya. bjp plan to encash this situation. bjp friendly to aiadmk after forming in central governament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X