వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: జెడి(ఎస్)తో చర్చలకు బిజెపి అధిష్టానం ఓకే

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా అవసరమైన మెజారిటీ రానందున జెడి(ఎస్) తో చర్చలు జరిపేందుకు బిజెపి జాతీయ నాయకత్వం సానుకూల సంకేతాలు కర్ణాటక రాష్ట్ర బిజెపి నేతలకు ఇచ్చింది.

Recommended Video

Karnataka Assembly Elections 2018 Result Updates (Video)

కర్ణాటక రాష్ట్రంలో కనీస మెజారిటీకి బిజెపి దూరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జెడి(ఎస్) మద్దతు అనివార్యంగా మారనుంది. అయితే జెడి(ఎస్) నేత , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలకు బిజెపి జాతీయ నాయకత్వం చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బిజెపి అగ్ర నేతలు హుటాహుటిన బెంగుళూరు బయలుదేరారు. బిజెపి నేతలు కూడ జెడి(ఎస్)తో పొత్తుకు సంకేతాలు ఇచ్చారు.

Bjp plans to talk with Jd(s) for seeking support from government

ఈ తరుణంలో జెడి(ఎస్) చీప్ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ , ఆయన తనయుడు కుమారస్వామి తాజా రాజకీయ పరిస్థితులపై బెంగుళూరులో చర్చిస్తున్నారు. మరో వైపు జెడి(ఎస్) నేత కుమారస్వామితో చర్చించేందుకు కేంద్ర మంత్రులు జెపి నడ్డా, ప్రకాష్ జవదేకర్ లు బెంగుళూరుకు బయలుదేరారు.

అసలు జెడి(ఎస్) నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై అంటారా, బిజెపితో ముందుకు వెళ్తారా అనేది తేలనుంది. మరో వైపు సాయంత్రం 5 గంటలకు జెడి(ఎస్) నేత కుమారస్వామి సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు.

English summary
Bjp national leadership ready to talk with JD(s) leaders Kumaraswamy for seeking support to form government in Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X