వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మాస్టర్ మైండ్, భార్య కోసం రజనీకాంత్ రాజకీయాల్లోకి, కేసుల భయం, ఐటీ, కాంగ్రెస్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ నాయకులు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద ఒత్తిడి తీసుకు వచ్చి కొత్త పార్టీ పెట్టిస్తున్నారని, అయితే తమిళ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్లు కాదని ఢిల్లీ పెద్దలు గుర్తించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఇవీకేఎస్, ఇళంగోవన్ ఆరోపించారు. మోడీ మాస్టర్ మైండ్ తో బీజేపీ నాయకుల చేస్తున్న ఒత్తిడికి, భార్యను కేసుల నుంచి రక్షించుకోవడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టి బలి కావడానికి సిద్దం అవుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ ఆరోపించారు.

మోడీ మాస్టర్ మైండ్

మోడీ మాస్టర్ మైండ్

కేంద్రంలో ప్రస్తుతం మతతత్వపార్టీ ఉందని, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీని ఆడించడానికి ఎత్తులు వేస్తోందని, ఆ విషయాన్ని ఇక్కడి ప్రభుత్వ పెద్దలు పసిగట్టలేకపోతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ ఆరోపించారు.

అమ్మను మరిచిపోయారు

అమ్మను మరిచిపోయారు

ఇంత కాలం జయలలితను అమ్మా అమ్మా అంటూ పిలిచిన అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు అమ్మను మరిచిపోయి ఢిల్లీలోని పెద్దలను అయ్యా అయ్యా అంటు పిలుచుకుంటున్నారని, వర్గ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ ఆరోపించారు.

30 ఏళ్లు రజనీ ఏం చేశారంటే !

30 ఏళ్లు రజనీ ఏం చేశారంటే !

30 ఏళ్ల క్రితం రజనీకాంత్ ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 30 ఏళ్ల నుంచి ఇప్పటి వరకూ సినిమాలు తీస్తున్నారు. రజనీకాంత్ సినిమాల్లో నటించాలి అంతే కాని రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో అర్థం కావడంలేదని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ అన్నారు.

భార్య కోసం రజనీ ప్లాన్

భార్య కోసం రజనీ ప్లాన్

రజనీకాంత్ కు తమిళనాడు ప్రజల సమస్యలు తెలియవని, ఇక్కడ ఎలా అభివృద్ది చెయ్యాలి అనే అవగాహన లేదని, కేవలం ఆయన భార్య మీద ఉన్న ఆదాయపన్ను ఎగవేత ఆరోపణల నుంచి రక్షించుకోవడానికి బీజేపీ పెద్దలు చెప్పినట్లు సూపర్ స్టార్ ఆడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ ఆరోపించారు.

మోడీ vs రాహుల్ గాంధీ

మోడీ vs రాహుల్ గాంధీ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటారని, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే. స్టాలిన్ ఉంటారని, మోడీ ప్రభుత్వం ఇంటికి వెలుతుందని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ జోస్యం చెప్పారు.

కార్తీ, అమిత్ షా కొడుకు

కార్తీ, అమిత్ షా కొడుకు

కార్తీ చిదంబరం అరెస్టుపై మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడి కుమారుడు అయినందునే కార్తీ చిదంబరంను అరెస్టు చేశారని, అదే అమిత్ షా కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేసి అరెస్టు చెయ్యలేదని కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్ ప్రశ్నించారు.

English summary
Senior Congress leader and former union minister Elangovan has said the Bharatiya Janata Party is pressurising superstar Rajinikanth to float a political party soon. A communal regime is in place in the Centre, while a paralysed government is in power in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X