వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ వర్సెస్ బీజేపీ: ‘మాస్టర్’ షూటింగ్ అడ్డగింత.. కేంద్రానికి ఫిర్యాదు.. నెట్టింట్లోనూ రచ్చరచ్చ

|
Google Oneindia TeluguNews

ఒకటికాదు రెండు కాదు.. 15 బ్యాగుల నిండా డబ్బు సంచుల్ని కోలీవుడ్ హీరో విజయ్ ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. సినిమా వ్యాపారం ముసుగులో హీరో విజయ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని తమిళనాడు బీజేపీ నేతలు ఆరోపించారు. విజయ్ కి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. అందులో భాగంగా నైవేలిలో మాస్టర్ సినిమా షూటింగ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. డబ్బు సంచులు ఎక్కడివో చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

35 గంటల విచారణ..

35 గంటల విచారణ..

బిగిల్(తెలుగులో విజిల్) సినిమాకు సంబంధించి హీరో విజయ్, నిర్మాత, ఫైనాన్షియర్లు పన్నుల ఎగవేతకు ప్రయత్నించారన్న సమాచారంతో ఐటీ శాఖ గురువారం దాడులు నిర్వహించింది. నేరుగా నైవేలిలోని షూటింగ్ స్పాట్ కు వెళ్లిన అధికారులు.. విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో చెన్నై, మధురైలో హీరో విజయ్, నిర్మాత అన్బు చెలియన్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.77 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 35 గంటల విచారణ తర్వాత అధికారులు విజయ్ ని వదిలేశారు. అంతా సవ్యంగా ఉందని క్లీన్ చిట్ కూడా ఇచ్చారు.

గనిలో షూటింగ్ వద్దు..

గనిలో షూటింగ్ వద్దు..


35 గంటలపాటు ఐటీ అధికారుల విచారణ ఎదుర్కొన్న హీరో విజయ్.. శుక్రవారం యధావిధిగా షూటింగ్ కు హాజరయ్యారు. కడలూరు జిల్లా నైవేలిలోని బొగ్గు గనిలో ఆయన నటిస్తోన్న ‘మాస్టర్' సినిమాను షూట్ చేస్తున్నారు. హీరో విజయ్, నటుడు విజయ్ సేతుపతి మధ్య ఫైట్ సీన్లు తీస్తుండగా.. అక్కడికొచ్చిన బీజేపీ నేతలు షూటింగ్ నిలిపేయాలని గొడవ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.

ఢిల్లీకి ఫిర్యాదు..

ఢిల్లీకి ఫిర్యాదు..

విజయ్ షూటింగ్ చేస్తోన్న నైవేలీ బొగ్గు గనులు.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనివి కావడంతో అక్కడణ్నుంచి వెళ్లిపోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇకముందు కూడా గనుల్లో షూటింగ్ బంద్ పెట్టేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయ్ తన సినిమాల్లో బీజేపీ విధానాల్ని వ్యతిరేకిస్తున్నందుకే ఆయనపై ఐటీ దాడులు, షూటింగ్ అడ్డగింతలు జరుగుతున్నాయిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలోనూ ‘విజయ్ వర్సెస్ బీజేపీ' ట్యాగ్ ట్రెండయింది.

English summary
BJP party conducted protests in front of the second mines site of the Neyveli Lignite Factory (NLC) where Vijay and Vijay Sethupathi were involved in fight sequence on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X