వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: కోల్‌క‌త‌..ర‌ణ‌రంగం! బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌! అడ్డుకున్న పోలీసులు.. విరిగిన లాఠీలు!

|
Google Oneindia TeluguNews

కోల్‌క‌త‌: ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌త అట్టుడికిపోతోంది. త‌మ పార్టీ నాయ‌కుల‌ వ‌రుస హ‌త్య‌ల‌ను నిర‌సిస్తూ భార‌తీయ జ‌నతా పార్టీ కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులు బుధ‌వారం చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తంగా మారింది. ప్ర‌భుత్వం కార్యాల‌యాల‌పై రాళ్లు విసురుతున్న ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. వారిపై వాట‌ర్ క్యాన‌న్ల‌ను ప్ర‌యోగించారు. అయిన‌ప్ప‌టికీ- బీజేపీ కార్య‌క‌ర్త‌లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ప్ర‌భుత్వానికిక వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదే బైఠాయించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచీ ప‌శ్చిమ బెంగాల్‌లో త‌ర‌చూ హింసాత్మ‌క ప‌రిస్థితులు చెల‌రేగుతున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య ఆధిపత్య పోరు కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించ‌డానికి త‌ర‌చూ దాడులకు దిగుతున్నారు. ఈ దాడులు కాస్తా ప్రాణాంత‌కంగా మారాయి. హ‌త్యా రాజ‌కీయాల‌కు దారి తీశాయి. పోలింగ్‌కు ముందు, పోలింగ్ త‌రువాత ప‌శ్చిమ బెంగాల్‌లో ఈ రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్య‌ర్థుల చేతుల్లో దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతున్నారు.

JP protests workers killings, teargas, water cannons bring Kolkata to a standstillJP protests workers killings, teargas, water cannons bring Kolkata to a standstill

దీనికి నిర‌స‌న‌గా బీజేపీ కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులు బుధ‌వారం ఉద‌యం కోల్‌క‌త‌లో భారీ స్థాయిలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను చేప‌ట్టారు. ఇందులో పాల్గొన‌డానికి రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తల‌తో కోల్‌క‌త న‌గ‌రం కాషాయ‌మ‌య‌మైంది. వంద‌లాది మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న హింసాత్మ‌కంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పై రాళ్లు రువ్వ‌డం ఆరంభించారు. దీనితో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది.

JP protests workers killings, teargas, water cannons bring Kolkata to a standstillJP protests workers killings, teargas, water cannons bring Kolkata to a standstill

నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకోవ‌డానికి పోలీసులు ప‌లు ప్రాంతాల్లో బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా పోలీస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం ఉన్న బిపిన్ బిహారీ గంగూలీ రోడ్డు, లాల్ బ‌జార్‌ స‌హా ప‌లు ప్రాంతాల్లో లో పోలీసులు బ్యారికేడ్ల‌ను అందుబాటులో ఉంచారు. వాటిని దాటుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. పోలీసులు అడ్డుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందుకు దూసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తోన్న బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీఛార్జి చేశారు. వాట‌ర్ క్యాన‌న్ల‌ను ప్ర‌యోగించారు. ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న‌కారుల నినాదాల‌తో ప‌రిస‌ర ప్రాంతాలు మారుమోగిపోయాయి. ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీడియో: స్పైస్‌జెట్ దుబాయ్ ఫ్లైట్‌: ల్యాండ్ అవ్వ‌గానే పేలిన టైరు!వీడియో: స్పైస్‌జెట్ దుబాయ్ ఫ్లైట్‌: ల్యాండ్ అవ్వ‌గానే పేలిన టైరు!

English summary
BJP workers on Wednesday launched a massive protest in the heart of Kolkata to protest against killings of party workers across the state. As huge crowds gathered in Kolkata near the police headquarters, police erected barricades to stop the protests from flaring up. However, BJP workers still managed to bring down some of the barricades when Kolkata Police personnel, who were deployed in huge numbers, resorted to teargas shelling and used water cannons to disperse the crowd. BJP workers carrying party flags were seen climbing up barricades set up by Kolkata Police to reach the police headquarters. This is when police shot off the water cannons to disperse the crowd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X