వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారణాసి నుంచి మోడీ... గాంధీనగర్ నుంచి అమిత్ షా: బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

|
Google Oneindia TeluguNews

దేశంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలు పోటీలో నిలవనున్న తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బరిలో నిలవనున్న రేసు గుర్రాల పేర్లను కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 150 మంది అభ్యర్థులను తొలివిడతలో ఇప్పటికే ప్రకటించగా... తాజాగా బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మూడు సమావేశాల్లో అభ్యర్థులపై కసరత్తు చేసిన పార్టీ గురువారం తమ గెలుపు గుర్రాలను ప్రకటించింది.లోక్‌సభ ఎన్నికలకు దాదాపు 182 మందితో కూడిన తొలిజాబితాను కమలం పార్టీ ప్రకటించింది. ఇక ముందునుంచి అనుకుంటున్నట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీలో దిగనున్నారు. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు.

 పాకిస్థాన్ మరో కుట్ర : భారత కరెన్సీ పాకిస్థాన్ లో ప్రింటింగ్ హైదరాబాద్ లో చలామని ! పాకిస్థాన్ మరో కుట్ర : భారత కరెన్సీ పాకిస్థాన్ లో ప్రింటింగ్ హైదరాబాద్ లో చలామని !

మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలోకి దిగనుండగా నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి పోటీలో నిలవనున్నారు. రవిశంకర్ ప్రసాద్ పట్నాసాహిబ్ నుంచి పోటీలో ఉండగా... ఈ సారి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అమేథీ నుంచి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు స్మృతీ ఇరానీ. ఇక వీకే సింగ్ ఘజియాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. గౌతం బుద్ నగర్ నుంచి మహేష్ శర్మ పోటీలో ఉంటుండగా..మథురా నుంచి హేమామాలిని బరిలో దిగనున్నారు.

BJP releases first list of Lok Sabha candidates

ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారనున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించిన 30 మంది అభ్యర్థులను ప్రకటించారు జేపీ నడ్డా. మహారాష్ట్రకు సంబంధించి శివసేనతో పొత్తు కుదరడంతో అక్కడ 21 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇక బీహార్‌లో జేడీయూతో కలిసి పోటీచేస్తుండటంతో అక్కడ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కేరళలో 14 మంది అభ్యర్థులు, ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇక వీటితో పాటు ఒడిషా, జార్ఖండ్, కర్నాటక, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, అస్సోం, త్రిపురా, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు జేపీ నడ్డా.

English summary
The Bharatiya Janata Party (BJP) released its first list of candidates for the Lok Sabha election in New Delhi. Senior BJP leader and Union minister JP Nadda announced the name of BJP candidates for the Lok Sabha polls. The Congress has already announced names of nearly 150 candidates, while most other parties have also started announcing their candidates for the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X