వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా మెజార్టీ చూసి ఊపిరిపీల్చుకున్న బీజేపీ : అద్వానీని తప్పించడం సరైన నిర్ణయమే ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జెట్‌స్పీడులో వెళ్తుంది. 300పై చిలుకు స్థానాల్లో స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తుంది. బీజేపీ అగ్రనేతల మెజార్టీ కూడా గతంలో కన్నా పెరిగిపోతోంది. ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా .. తమ కంచుకోట గాంధీనగర్ నుంచి 5 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అమిత్ మెజార్టీ భారీగా ఉండటంతో బీజేపీ ఊపిరిపీల్చుకుంది. లేదంటే ఆ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేది.

కంచుకోట ..
గుజరాత్‌లోని గాంధీనగర్ బీజేపీ కంచుకోట. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు అద్వానీ. ఇక్కడినుంచే ఆయన ఆరుసార్లు పోటీచేసి .. విజయం సాధించారు. కానీ ఈసారి అద్వానీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీనిపై పార్టీలో మోదీ, షా వ్యతిరేక వర్గం, విపక్షాలు ఒంటికాలిపై విమర్శలు చేశాయి. కానీ తమ అంచనాల ప్రకారం అద్వానీకి టికెట్ ఇవ్వలేదు. ఇది బీజేపీ చేసిన ధైర్యమే అని చెప్పాలి. ఒకవేళ అమిత్ షా గెలవడమే కాదు కదా ? మెజార్టీ తగ్గినా .. మోదీ, షా గుక్కతిప్పుకోని పరిస్థితి ఏర్పడేది.

bjp relief to amith shah majority : why ?

అద్వానీ కన్నా ఎక్కువే ..
గత ఎన్నికల్లో అద్వానీ 4 లక్షల 83 వేల 120 ఓట్లతో తన ప్రత్యర్థి ఈశ్వరిబాయి పటేల్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికలో అద్వానీకి 7 లక్షల 73 వేల 539 ఓట్లు రాగా .. 2 లక్షల 90 వేల 419 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. కంచుకోట గాంధీనగర్‌లో దాదాపు 5 లక్షల మెజార్టీతో విజయం సాధించారు అద్వానీ. అయితే సామాజిక సమీకరణాలు, వివిధ అంచనాలతో అద్వానీని టికెట్ ఇవ్వలేదు. ఈ సారి అక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. నామినేషన్ వేసే సమయంలోనే మంది మార్బలంతో ర్యాలీ తీసిన షా ... తర్వాత కూడా జోరుగా ప్రచారం చేశారు. దీంతో ఆయన 5 లక్షల 81 వేల 831 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. అంటే అద్వానీ కన్నా 35 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి .. బీజేపీకి ఊపిరిపీల్చుకొనిచ్చారు. మెజార్టీ రాకుంటే విపక్షాలే .. స్వపక్షంలోని వైరివర్గాలు కూడా విమర్శల జడివాన కురిసే అవకాశం ఉండేది. కానీ మెజార్టీ సాధించి వారికి ఉపశమనం కలిగించారు. అమిత్ శా‌కు 8 లక్షల 44 వేల 220 ఓట్లు పోల్ కాగా .. కాంగ్రెస్ అభ్యర్థి చావ్ డాకు 3 లక్షల 25 వేల 389 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.

English summary
The NDA alliance goes to the 300 seats. BJP chief Amit Shah, who won from the Gandhinagar 5 lakh votes. The BJP was criticize because Amith shah Majority was heavier. Otherwise, that party is facing severe criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X