బెంగాల్ బీజేపీలోకి 13 మంది నటులు, టీఎంసీ ఎంపీలకు ధీటుగా పనిచేస్తారని ధీమా
కోల్కతా : పార్లమెంట్ ఎన్నికలకు ముందు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సినీతారలు చేరిపోయారు. వారికి టిక్కెట్లు కేటాయించారు కూడా ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే ఎన్నికల్లో మాత్రం టీఎంసీ కన్నా బీజేపీకి ఆశించిన కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఒకరు కాదు ఇద్దరు కాదు 13 మంది టీవీ నటులు బీజేపీలో చేరారు. దీంతో రెండేళ్లలో బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలపై కమళదళం ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నట్టు ఆ పార్టీ చర్యల ద్వారా అర్థమవుతుంది.
నటులతో కళ కళ ..
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ టీవీ నటులను తీసుకొని ఢిల్లీ వచ్చారు. వారు బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రిషి కౌశిక్, పార్నో మిత్రా, కంచనా, రుపాంజన, బిశ్వజిత్ గంగూలీ, దేబ్ రంజన్ నాగ్, అరిందన్ హల్దార్, మౌమిత గుప్తా, అనింద్య బెనర్జీ, సౌరవ్ చక్రవర్తి, రుపా భట్టాచార్య, అంజనా బసు, కౌశిక్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా బెంగాల్ టీవీ, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీవీ నటులు బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు ఘోష్. ఇప్పటికే తమ పార్టీ నేతలపై దాడులు చేసి, భయాందోళనకు గురిచేస్తున్న తరుణంలో .. బీజేపీలో చేరేందుకు వారి చేసిన ధైర్యాన్ని కొనియాడారు.

అంతేకాదు వీరంతా బీజేపీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహన్కు సమాధానం చెబుతారని పేర్కొన్నారు. అంతేకాదు బెంగాల్లో మరిన్ని చేరికలు కూడా ఉంటాయని సంకేతాలిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు మొదలైందని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ 22 ఎంపీ సీట్లు గెలుచుకోగా .. బీజేపీ 18 సీట్లు సాధించింది. దీంతో బెంగాల్లో ఆధిపత్య పోరు మొదలైంది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!