బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాతో బీజేపీ ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత: రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ్యుడు(ఎంపీ) అశోక్ గస్తి(55) కరోనాబారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నమే ఆయన మరణించినట్లు వార్తలు రావడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు.

అయితే, ఆ తర్వాత అశోక్ గస్తి చికిత్స పొందుతున్న ఆస్పత్రి యాజమాన్యం.. ఆయన ఇంకా మరణించలేదని, పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. అనంతరం గురువారం రాత్రి 10.31 గంటలకు అశోక్ గస్తి కన్నుమూశారని మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ వెల్లడించారు.

 BJPs Ashok Gasti, 1st-Time Rajya Sabha Member, Dies Due To Coronavirus

కరోనాతోపాటు ఆయన నిమోనియా, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్‌తో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి వరకు కూడా అశోక్ గస్తి ఐసీయూలోనే చికిత్స పొందారని, రాత్రి 10.31 గంటలకు మృతి చెందారని తెలిపారు.

కాగా, సెప్టెంబర్ 2న కరోనా సోకడంతో అశోక్ గస్తి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన ఇటీవల ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరుకాలేకపోయారు. తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. ఒక్కసారి కూడా సమావేశాలకు హాజరుకాకుండానే కన్నుమూశారు.

అశోక్ గస్తి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంకితభావం కలిగిన కార్యకర్త అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. పేదల ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడ్యూరప్ప.. ఎంపీ అశోక్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. పలువురు బీజేపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

కాగా, కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి చెందిన అశోక్ గస్తి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కర్ణాటకలో చాలా మందికి అశోక్ గస్తి గురించి తెలీదు. వివాదాలకు, గ్రూపు రాజకీయాలకు అశోక్ గస్తి చాలా దూరంగా ఉంటారు. తనపని తాను చేసుకు వెలుతున్న అశోక్ గస్తి గత రాజ్యసభ ఎన్నికల పోటీలో అసలు లేరు.

Recommended Video

Coronavirus Vaccine: India Can Get Early Next Year | Oneindia Telugu

కర్ణాటక శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలని చాలా మంది బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేశారు .అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ హైకమాండ్ అశోక్ గస్తి పేరు సూచించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు. సామాన్య కార్యకర్తలకు కూడా మేము గుర్తింపు ఇస్తామని అశోక్ గస్తిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేసిన బీజేపీ హైకామండ్ అందరికి ఊహించని షాక్ ఇచ్చింది.

English summary
Ashok Gasti, a BJP Rajya Sabha member from Karnataka, has died due to COVID-19, a hospital confirmed today, hours after confusion caused by condolence tweets posted by top politicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X