వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ ఇంకేదో చేస్తారని: గుజరాత్‌లో బుల్లెట్ రైలు పని చేసింది!

|
Google Oneindia TeluguNews

ముంబై/అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. గుజరాత్‌లో సీట్లు తగ్గడానికి, రెండు రాష్ట్రాల్లో కమల వికాసానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో బుల్లెట్ రైలు మేజిక్ కూడా ఉందని అంటున్నారు.

సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న బీజేపీపై గుజరాత్‌లో వ్యతిరేకత ఉండటం సహజం. పైగా కాంగ్రెస్ పార్టీకి పలువురి అండ దొరికింది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ-అమిత్ షా జోడి గుజరాత్‌ను నెగ్గుకొచ్చింది. బీజేపీ విజయానికి దోహదం చేసిన వాడిలో బుల్లెట్ రైలు కూడా ఉందని అంటున్నారు.

బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలుబీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు

బుల్లెట్ రైలు అభివృద్ధి

బుల్లెట్ రైలు అభివృద్ధి

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యాలయాల వలె మహారాష్ట్రలోని కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. ఈ సమయంలో బీజేపీ ముంబై చీఫ్ ఆశిష్ షేలార్ మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్న అభివృద్ధి ఫలాలకు నిదర్శనం అన్నారు. కాగా, ఇటీవల ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

అందుకే బుల్లెట్ రైలు

అందుకే బుల్లెట్ రైలు

దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ఎన్నో మెట్రో నగరాలు ఉన్నా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు మోడీ మొగ్గు చూపారు. గుజరాతీయులు ఎక్కువగా ముంబైకి రాకపోకలు సాగిస్తుంటారనే కారణంతో ఈ రైలును ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల వ్యూహంగా కొందరు భావిస్తున్నారు.

మోడీ ఇంకేదో చేస్తారని

మోడీ ఇంకేదో చేస్తారని

దాదాపు 508 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టును జపాన్‌ సహకారంతో నిర్మించనున్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు జరిగింది కేవలం శంకుస్థాపనే అయినా రాష్ట్రాన్ని మోడీ పట్టించుకోవడం లేదన్న అపవాదు నుంచి బయటపడేసింది. సొంత రాష్ట్రం కోసం ఆయన ఇంకా ఏదో చేస్తారన్న భరోసాను కల్పించింది.

మోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, పద్మావతి నుంచి పాకిస్తాన్ దాకా.. ట్విట్టర్‌లో సెటైర్లుమోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, పద్మావతి నుంచి పాకిస్తాన్ దాకా.. ట్విట్టర్‌లో సెటైర్లు

కాంగ్రెస్ ముందే ఊహించి

కాంగ్రెస్ ముందే ఊహించి

బుల్లెట్‌ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశంలో రైల్వేల్లో భద్రతను గాలికొదిలేసి రూ.కోట్ల ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్న అపవాదు ఎదుర్కొన్నా సరే ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ ముందే ఊహించినట్టు ఉందని అంటున్నారు.
2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి 75 ఏళ్ల స్వతంత్ర భారతానికి అంకితమిస్తారని చెప్పారు.

English summary
BJP workers on Monday celebrated the party’s performance in Gujarat and Himachal Pradesh elections, distributing sweets and bursting firecrackers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X