
అఖిలేష్ పార్టీకి షాక్: రాంపూర్ లోక్‌సభ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి అధికార బీజేపీ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఘన్‌శ్యాం సింగ్ లోధి 42,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
'నా
గెలుపును
పార్టీ
కార్యకర్తలకు
అంకితం
చేస్తున్నాను.
వారు
పగలు,
రాత్రి
నిరంతరం
పని
చేస్తున్నారు.
రాంపూర్
ప్రజలకు
నేను
కృతజ్ఞతలు
చెప్పాలనుకుంటున్నాను'
అని
ఘనశ్యామ్
లోధీ
వార్తా
సంస్థ
ఏఎన్ఐతో
అన్నారు.
ఇటీవల
బీజేపీలో
చేరిన
లోధీ
మాట్లాడుతూ..
కాషాయ
పార్టీ..ప్రజల
అభివృద్ధికి
ఎల్లప్పుడూ
కృషి
చేస్తుంది
అని
అన్నారు.

రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో 37,797 ఓట్లతో బీజేపీ విజయం సాధించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలిపారు. "మత, విభజన, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం. 'వికాస్ రాజకీయాల' కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆచరించిన ఆదేశానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ బాగా సహకరించారు, అని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ రాంపూర్‌లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. 'రాంపూర్‌లో గెలిచాం. అజంగఢ్‌లో కూడా మేము ఇతరుల కంటే ముందున్నాము. ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు, సీఎం పనితీరు ఆధారంగా ఈ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని పాఠక్ అన్నారు.
"సమాజ్‌వాదీ పార్టీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. ప్రజలు ఇక ఎలాంటి అల్లర్లను కోరుకోరు. వారు శాంతిని కోరుకుంటున్నారు. వారు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్
అసెంబ్లీకి
ఎన్నికైన
తర్వాత
సమాజ్‌వాదీ
పార్టీ
సీనియర్
నాయకుడు
ఆజం
ఖాన్
రాజీనామా
చేయడంతో
రాంపూర్
లోక్‌సభ
స్థానం
ఖాళీ
అయింది.
రాంపూర్
నుంచి
సమాజ్‌వాదీ
పార్టీ
అసిమ్రాజాను
బరిలోకి
దించగా..
బహుజన్
సమాజ్
పార్టీ
(బీఎస్పీ)
పోటీ
చేయలేదు.