బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ కు షాక్: మేయర్ పదవి కూడా పాయే: ఎగిరిన కాషాయ జెండా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కు మరో షాక్. చేతికి అందిన అధికారాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యే వల్ల కోల్పోయి.. దిగ్భ్రాంతిలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి మరో తేరుకోని దెబ్బ పడింది. ఇన్నాళ్లూ తమ చేతిలో ఉన్న బెంగళూరు మేయర్ పదవిని పోగొట్టుకుంది. ఆ స్థానాన్ని భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కార్యాలయంపై తాజాగా కాషాయ జెండా ఎగిరింది. మేయర్ గా బీజేపీ కార్పొరేటర్ ఎం గౌతమ్ కుమార్ ఎన్నికయ్యారు. బెంగళూరులోని జోగుపాళ్య నుంచి ఆయన రెండోసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.

డిప్యూటీ కూడా పోటాపోటీ..

డిప్యూటీ కూడా పోటాపోటీ..

మేయర్, ఉప మేయర్ పదవి కోసం మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ సత్యనారాయణను ఓడించారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లో ఉప మేయర్ ఎవరనేది కూాడా తేలిపోతుంది. బెంగళూరు మహానగర పాలికెకు గౌతమ్ కుమార్ 54వ మేయర్. రేపో, మాపో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కర్ణాటక బీజేపీ నాయకులు వెల్లడించారు. ఉప మేయర్ స్థానం కూడా తమకే దక్కుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 43 సంవత్సరాల ఎం గౌతమ్ కుమార్ కామర్స్ గ్రాడ్యుయేట్. మార్వాడీ కుటుంబానికి చెందిన ఆయన తొమ్మిదేళ్లుగా జోగు పాళ్య డివిజన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సుదీర్ఘకాలం పాటు కొనసాగినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.

మేజిక్ ఫిగర్ కోసం నాలుగు ఓట్లు తగ్గినా..

మేజిక్ ఫిగర్ కోసం నాలుగు ఓట్లు తగ్గినా..

బీబీఎంపీలో 257 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బలబలాల ప్రకారం.. బీజేపీ-125, కాంగ్రెస్-104, జనతాదళ్ (ఎస్)- 21 మంది సభ్యులు కాగా, మరో ఏడు మంది స్వతంత్ర కార్పొరేటర్లుగా ఉన్నారు. మేయర్ పదవి కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ 129. బీజేపీకి 125 స్థానాలే ఉన్నప్పటికీ.. స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా లోపాయకారిగా బీజేపీకి మద్దతు తెలిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని ఏ పార్టీ కూడా ఇంకా ధృవీకరించలేదు.

నాడు ప్రభుత్వం..నేడు మేయర్ పీఠం

నాడు ప్రభుత్వం..నేడు మేయర్ పీఠం


కొద్దిరోజుల కిందటి వరకూ కాంగ్రెస్-జేడీఎస్ సారథ్యంలో కర్ణాటకలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలకు చెందిన సుమారు 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలో సుమారు 14 నెలల పాటు కొనసాగిన ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఇచ్చిన ఈ షాక్ నుంచి తేరుకోలేక ముందే.. మేయర్ పీఠాన్ని కూడా కోల్పోవడం కాంగ్రెస్ ను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

English summary
BJP corporator from Jogupalya M Goutham Kumar has been elected the 54th mayor of Bengaluru. He defeated R Satyanarayana from the Congress to win the top elected post in Bruhat Bengaluru Mahanagara Palike (BBMP), Bengaluru’s local civic body. He secured 129 votes after a lot of confusion and several differences in the BJP camp that took place from this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X