వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

143 మంది టీఎంసీ నేతలు టచ్‌లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత బెనర్జీ, మాయావతి లాంటి నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే మాయావతి రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడంతో సేఫ్ కానీ .. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం ఉండటంతో అక్కడ బీజేపీ నేతలు ఫోకస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మారిన పరిస్థితి

మారిన పరిస్థితి

ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షాతో మమతా బెనర్జీ మాటల తూటాలు పేల్చారు. బెంగాల్ లో పరిస్థితి వేరు .. టీఎంసీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీకి 18 సీట్లు రావడంతో .. మమతా కూడా ఒకింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో మమతా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామనే సంకేతాలు ఇస్తున్నారు బీజేపీ నేతలు. నిన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెంట్స్ చేయగా .. ఇవాళ బీజేపీ నేత ముకుల్ రాయ్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో 141 మంది టీఎంసీ రెబల్ నేతలు టచ్ లో ఉన్నారని కాకరేపారు.

టచ్ లో 143 మంది నేతలు

టచ్ లో 143 మంది నేతలు

వాస్తవానికి ముకుల్ రాయ్ ఒకప్పుడు టీసీఎంలో ఉన్నారు. కానీ మమతతో పొసగక 18 నెలల క్రితం పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోసిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు ముకుల్ రాయ్. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఘోర ఓటమి చవిచూసిందన్నారు. దాదాపు 143 అసెంబ్లీ పరిధిల్లోని ఎంపీ స్థానాల్లో టీఎంసీ ఓడిపోయిందని చెప్పారు. వారంతా టీఎంసీలో కొనసాగేందుకు సుముఖంగా లేరని స్పష్టంచేశారు. వారంతా తనతో టచ్ లో ఉన్నారనే విధంగా వ్యాఖ్యానించారు రాయ్.

ద్రోహి వర్సెస్ దేశద్రోహి

ద్రోహి వర్సెస్ దేశద్రోహి

తనను మమత ద్రోహి అనడం మంచిది కాదన్నారు ముకుల్ రాయ్. కానీ మమతలా తాను దిగజారి విమర్శలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మమతకు అన్నీ అవకావాలు ఇచ్చిందని .. ఐదుసార్లు ఎంపీని చేసి, కేంద్రమ్ంత్రిని చేస్తే ఆమె పార్టీని వదలివెళ్లడం దేశద్రోహం కాదా అని ప్రశ్నించారు. వాజ్ పేయి ఆమెకు కేంద్రమంత్రి పదవీ ఇస్తే .. బీజేపీతో కూడా దూరంగా మెలగడం ఏంటని ప్రశ్నించారు. ఇదీ కూడా తన దృష్టిలో దేశద్రోహమేనని .. కానీ తనల విమర్శించబోను అని స్పష్టంచేశారు.

 ఎందుకు తగ్గాయంటే

ఎందుకు తగ్గాయంటే

ఈ సారి టీఎంసీ సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నిస్తే .. రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ వెంట టీఎంసీ ఉందని ... ఈసారి టీఎంసీ ఒంటిరిగా బరిలోకి దిగిందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ప్రజలు విశ్వసించారని గుర్తుచేశారు. వాస్తవానికి బెంగాల్ లో తాము 25 సీట్లు వస్తాయని ఆశించామని .. కానీ 18 సీట్లే వచ్చాయని పేర్కొన్నారు. మరిన్ని సీట్లు గెలిస్తే .. టీఎంసీ ప్రభ మరింత తగ్గేదని అభిప్రాయపడ్డారు.

English summary
the Bharatiya Janata Party has hit a jackpot in West Bengal by winning 18 seats out of 42 in the state. The team that worked behind the scenes had BJP leader Mukul Roy who had joined the BJP 18 months ag. Mukul Roy left the TMC after differences with party supremo Mamata Banerjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X