చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు చెక్, అన్ని వైపులా ఇలా కట్టడి!: పన్నీరుసెల్వంతో బీజేపీ పావులు?

జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పాలని చూస్తోందా? అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పాలని చూస్తోందా? అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే పార్టీలో శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం వర్గాలుగా ఉన్నాయని అంటున్నారు.

శశికళను మరిచారు!: పన్నీరుకే జయలలిత 'అధికారం', ఇలా..శశికళను మరిచారు!: పన్నీరుకే జయలలిత 'అధికారం', ఇలా..

జయలలిత మృతి నేపథ్యంలో శశికళ మొత్తం చక్రం తిప్పారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి పైన కూడా కన్నేశారు.

పన్నీరు సెల్వం పావుగా బీజేపీ చక్రం!

ఇప్పుడు పన్నీరు సెల్వం పావుగా బీజేపీ చక్రం తిప్పుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పన్నీరు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే మాజీ సీఎస్ రామ్మోహన రావు ఇంటి పైన ఐటీ దాడులు జరిగాయని అంటున్నారు.

sasikala

శశికళకు చెక్ చెప్పే ప్లానా?

తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శశికళ పైన ఒత్తిడి పెంచేందుకు, శశికళకు చెక్ పెట్టేందుకు పన్నీరు సెల్వాన్ని పావుగా ఉపయోగించుకుంటూ బీజేపీ ముందుకెళ్తోందా అనే చర్చ సాగుతోంది.

మాజీ సీఎస్ రామ్మోహన రావు జయలలితకు, శశికళకు దగ్గర. ఆయన ఇంటి పైన, అలాగే శశికళ మరికొందరు సన్నిహితుల ఇళ్ల పైన ఐటీ దాడులు జరిగాయని అంటున్నారు.

శశికళను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నమా?

త్వరలో మరికొందరు అధికారులు, ఇతరుల పైన ఐటీ దాడులు జరగవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ఐటీ దాడులతో తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పడం ద్వారా శశికళను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

హీరో అజిత్ ఔట్, పన్నీరు మౌనం: జయలలిత బతికి ఉంటే..!హీరో అజిత్ ఔట్, పన్నీరు మౌనం: జయలలిత బతికి ఉంటే..!

ఓ వైపు ఐటీ దాడులు, మరోవైపు చిన్నమ్మను వ్యతిరేకిస్తున్న దీపా జయకుమార్‌కు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పరోక్ష మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. దీపకు మద్దతిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇంకోవైపు ట్రాఫిక్ రామస్వామి.. జయలలితకు అందిన చికిత్సపై కోర్టుకు వెళ్లారు. జయ మృతి పైన అనుమానాలు.. ఇవన్నీ శశికళ పైన ఒత్తిడి పెంచేందుకు, అలాగే చెక్ చెప్పేందుకు అంటున్నారు.

శశికళకు షాక్: పోయెస్ గార్డెన్‌కు భద్రత తగ్గింపుశశికళకు షాక్: పోయెస్ గార్డెన్‌కు భద్రత తగ్గింపు

పన్నీరు సెల్వం బీజేపీకి అవకాశమిస్తే..

శశికళ పైన ఒత్తిడి పెంచాలనే ప్లాన్ వెనుక బీజేపీ ఉందని, దానికి పన్నీరు సెల్వం మద్దతు పలుకుతుండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే బీజేపీ కల నెరవేరుతుందా? లేక పన్నీరు సెల్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా? అనే చర్చ సాగుతోంది.

English summary
BJP's plan for Tamil Nadu: Sasikala vs Pannerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X