వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pramod Sawant Takes Oath As Goa Chief Minister | Oneindia Telugu

గోవా నూతనసిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వికారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.ఆయన తోపాటు 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు.కాగా వారిలో 9 మంది మంత్రులు కాగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కాగా వారంత పారికర్ క్యాబినెట్ మంత్రులే , ఇక మిత్రపక్షపార్టీలైన గోవా పార్వార్డ్ పార్టీ అధినేత విజయ్ సర్ధేశాయ్ , మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వికారం చేశారు.

పారికర్ ఆశయాలను ముందుకు తీసుకెళతాను
ప్రమాణ స్వికారం చేసిన అనంతరం సావంత్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆశాయలను ముందుకు తీసుకెళతానని అన్నారు.. బిజేపి తోపాటు సంకీర్ణ పక్షాలు , స్వతంత్ర్య ఎమ్మెల్యేలు నాపై పెద్ద భాధ్యతను ఉంచారని అన్నారు., నేను నా బృందం ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందేలా పనిచేస్తామని చెప్పారు.. కాగా పారికర్ చేసిన పలు సంక్షేమ కార్యక్రామాలను ఆయన గుర్తు చేశారు..ఈ నేఫథ్యంలోనే పారికర్ మన మధ్య లేరని అన్నారు..అయినా ఆయన ప్రవేశ పెట్టిన పథకాల అమలు తోపాటు మరిన్ని కొత్త పథకాలను తీసుకువస్తామని తెలిపారు.

 BJPs Pramod Sawant Takes Oath as Goa Chief Minister

రాష్ట్ర అభివృద్ది కోసం పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పారు. ఈ సంధర్భంగా సిఎమ్ గా భాద్యతలు చేపడుతున్న సమయంలో సావంత్ భార్య ,గోవా భాజపా మహిళ విభాగం అధ్యక్షురాలు సులక్షణ సావంత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమే సిఎమ్ గా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యావాదాలు తెలిపారు. అంతకు ముందు బిజేపి జాతియ అధ్యక్షుడు అమిత్ షా మరియు కేంద్రమంత్రి గడ్కారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటి అయ్యారు..

అయితే గోవాలో 14 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ సైతం తమకు అవకావం ఇవ్వాలని గవర్నర్ సిన్హానును కోరారు ..దీన్ని తిరస్కరించి అలయెన్స్ తో కూడిన అభ్యర్థికి అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరుపై మండిపడింది..గవర్నర్ సిన్హా బిజేపికి ఏజంట్ పనిచేశారని వివర్శించారు.

English summary
BJP's Pramod Sawant Takes Oath as Goa Chief Minister at 2am on tuesday Ceremony, The new government has two deputy chief ministers,from GFP chief Vijai Sardesai and MGP MLA Sudin Dhavalikar, from the two small parties backing BJP in the coastal state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X