వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వల్లే, పాత స్నేహ బంధం: నితీశ్‌తో సిన్హా భేటీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో మహాకూటమి గెలుపు ప్రజా గెలుపని బీజేపీ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని మాహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సీఎం నితీశ్ కుమార్‌తో సోమవారం సినీ నటుడు శత్రుఘ్న సిన్హా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ మాది చాలా పాత స్నేహ బంధం అని తెలిపారు. మా పార్టీ అధిష్టానం తీరువల్లే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు.

 BJP's Shatrughan Sinha Meets Nitish Kumar, Says He 'Will be Good for Bihar'

నితీశ్‌తో భేటీ అవడం బీజేపీని ఇబ్బంది కలిగించదన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించి ఉంటే తాను పార్టీలో ఉండేవాడిని కాదన్నారు. నితీశ్‌ని కలవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. బీజేపీకి నేను శత్రువుని కాదు. గత కొన్ని ఏళ్లుగా నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు.

బీహార్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో చర్చ జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓటమికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీహార్‌లో స్థానిక నేతలను విస్మరించడం వల్లే బీజేపీ ఓటమి పాలైందన్నారు. ప్రధాని మోడీ ప్రచారం చేయకంటే ఆ మాత్రం సీట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు.

కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడంపై పార్టీ నాయకత్వంపై గతంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో హేమమాలిని, అజయ్ దేవగన్‌లతో బీజేపీ ప్రచారం చేయించింది. అయితే వీరి ప్రచారానికి ప్రజలైతే హాజరయ్యారు గానీ ఓట్లు మాత్రం రాలలేదు.

ఓ బహిరంగ సభలో జేడీయూ ముఖ్యనేత, సీఎం నితీష్ కుమార్‌ను పొగడడంతో శత్రుఘ్న సిన్హాను పార్టీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.

243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో మాహాకూటమి 178 స్ధానాల్లో విజయం సాధించగా, ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. మరో 7 స్ధానాల్లో ఇతరులు విజయం సాధించారు.

English summary
It's personal, said Shatrughan Sinha as he drove up to meet man of the moment Nitish Kumar, who will be Bihar's chief minister for a third term after a humongous victory in the assembly elections on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X