వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై బిజెపి సవరణలు: క్రెడిట్ కొట్టేయాలని కాంగ్ హితవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని చెబుతున్న ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ ప్రధానంగా పది సవరణలను ప్రతిపాదిస్తోంది. పార్లమెంటుకు బిల్లు వచ్చినప్పుడు వాటిని పెడతామని చెబుతోంది. పోలవరం, హైదరాబాదు అంశాలు అందులో ఉన్నాయి. కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

బిజెపి సూచిస్తున్న ప్రతిపాదనలు... పోలవరం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ప్రకటించడం. 1956కు ముందు సీమాంధ్రలో ఉన్న భద్రాచలం, మునగాల, అశ్వారావుపేటలను కలపడం. ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన హైదరాబాదులో సీమాంధ్ర ప్రజల జీవితాలకు తగిన రక్షణ ఇవ్వాలి. దాని కోసం రాజ్యాంగ సవరణలు తేవాలి.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేలా కొత్త క్లాజ్ పెట్టాలి. సీమాంధ్ర రాజధానిపై బిల్లులోనే స్పష్టత ఇవ్వాలి. ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన చోట పని చేసుకునే అవకాశం ఇవ్వాలి. బిల్లుకు అత్యవసరమైన ఆర్థిక పత్రం కనిపించడం లేదు.

 BJP's stand on T, but seeks amendments in Bill

రాష్ట్ర ఆదాయంలో ముప్పై శాతం హైదరాబాదు నుండి వస్తున్నందున విభజన తర్వాత వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సీమాంధ్రకు పంచాలి. సీమాంధ్ర అవసరాలు తీర్చడానికి వీలుగా బిల్లులో ఆదాయ పంపిణీ అంశం చేర్చాలి. వివిధ రకాల విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. వెనుకపడిన కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి. పరిశ్రమలను ప్రోత్సహించాలి.

కాగా, బిజెపి ఇలా పలు సవరణలు ప్రతిపాదిస్తుండగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీమాంధ్ర ప్రాంత పార్టీ నేతలకు క్రెడిట్ కొట్టేయాలని సూచిస్తోంది. సీమాంధ్రకు ఏం కావాలో బిజెపి చెబుతోందని, ఆ ఘనత విపక్షానికి వెళ్లకుండా మీరే ప్రతిపాదిస్తే.. వాటిని బిల్లులో చేర్చి ఆమోదించేలా చూస్తామని, ఆ వైపు ఆలోచించాలని ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర కాంగ్రెసు నేతలకు సూచిస్తున్నారట. మంగళవారం జరిగిన వార్ రూం భేటీలోను దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు బిజెపి సూచనలు చేస్తోందని, ఆ సూచనలేవో మీరు చేస్తే ఘనత కాంగ్రెసుకే వస్తుందని చెప్పినప్పటికీ వారు సమైక్యం తప్ప మరొకటి లేదంటూ వినలేదట.

English summary
While reiterating his party’s commitment to Telangana statehood, senior BJP leader M Venkaiah Naidu said that the Centre is bound to honour the amendments being suggested to the T-Bill by the people of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X