వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ స్పందించింది.. ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే సస్పెన్షన్... నేరుం రుజువైతే కఠిన చర్యలని వార్నింగ్

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ పార్టీ స్పందించింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించిన యూపీ బీజేపీ సర్కార్ .. తాజాగా సెంగార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. లైంగికదాడి బాధితురాలి ప్రమాదానికి సెంగారే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో సెంగార్‌పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉన్నావ్ యాక్సిడెంట్ కేసు సీబీఐకి బదిలీ..?ఉన్నావ్ యాక్సిడెంట్ కేసు సీబీఐకి బదిలీ..?

ఉన్నావ్ లైంగికదాడి గురించి గతేడాదే బీజేపీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపిందని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి. దాంతో అతనిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. అప్పుడు నోటీసులు ఇచ్చి .. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాదు బాధితురాలిపై లైంగికదాడి చేసినట్టు విచారణలో తేలిన, యువతి కారు ప్రమాదానికి కారణం సెంగార్ అని తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తమ పార్టీలో తప్పుచేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

BJP Says Unnao MLA Already Suspended, Assures Strict Action If Found Guilty in Rape Case

గతేడాది ఉన్నావ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ లైంగికదాడి చేశాడు. తర్వాత ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా యువతి తండ్రిని జైళ్లో పెట్టారు. వారి దెబ్బలకు తాళలేక చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో జైలులో ఉన్న తన బంధువులను కలిసేందుకు వెళ్తున్న యువతి కారును ట్రక్కు ఢీ కొనడం అనుమానాలకు తావిచ్చింది. కానీ యువతి తల్లి మాత్రం అదీ ప్రమాదం కాదని చెప్పారు. పక్కా ప్రణాళికతో చేసిన దాడి అని పేర్కొన్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో విపక్షాల డిమాండ్‌కు బీజేపీ సర్కార్ తలొగ్గి కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సెంగార్‌పై వేటు వేయాలని డిమాండ్ చేయడంతో .. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బీజేపీ హైకమాండ్ స్పష్టంచేసింది.

English summary
The opposition parties have come down heavily on the Yogi Adityanath government in Uttar Pradesh after the Unnao rape survivor, who had accused BJP MLA Kuldeep Sengar of rape, met with a grievous accident on Sunday that killed two of her aunts. Under pressure to act against Sengar, BJP spokesperson Rakesh Tripathi on Tuesday claimed that Sengar has already been suspended after an enquiry by the disciplinary committee last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X