• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిక్కుల్లో శృతి హాసన్ -క్రిమినల్ కేసుకు బీజేపీ ఫిర్యాదు -తండ్రితో కలిసి అలా వెళ్లడంపై వివాదం

|

ప్రముఖ సినీ నటి శృతి హాసన్ మరో వివాదంలో ఇరుక్కుపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ బూత్ లోకి ఆమె అక్రమంగా ప్రవేశించారని, ఇందుకుగానూ క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. అదే సమయంలో శృతి హాసన్ తండ్రి మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత కమల్‌హాసన్ సైతం పోలింగ్ శైలిపై సంచలన ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామషాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ

చెన్నైలో ఓటేసి కోవైకి..

చెన్నైలో ఓటేసి కోవైకి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ నేతృత్వంలోని ఎంఎన్ఎం పార్టీ కూడా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎం అభ్యర్థుల తరఫున కమల్ కుమార్తెలైన శృతి హాసన్,అక్షర హాసన్, సమీప బంధువు సుహాసిని తదితరులు ప్రచారంలోనూ పాల్గొన్నారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చెన్నైలోని తైనంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఆ తర్వాత ముగ్గూరూ ప్రస్తుత వివాదానికి కేంద్రమైన కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు..

పోలింగ్ బూత్ సందర్శన..

పోలింగ్ బూత్ సందర్శన..

చెల్లెలు అక్షరతో కలిసి శ్రుతిహాసన్‌ తన తండ్రి కమల్ పోటీ చేస్తోన్న కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. అక్కడి ఓ పోలింగ్ లోపలికి వెళ్ళి ఓటింగ్ జరుగుతోన్న తీరును ఆరా తీశారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, కమల్ అభ్యర్థి కాబట్టి ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలోని బూత్ లోకి వెళ్లే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో అభ్యర్థి వెంట ఎవరూ ఉండరాదనే నిబంధన కూడా ఉంది. కానీ ఇవేవీ పట్టనట్లు శృతి హాసన్ పోలింగ్ బూత్ లో కలియదిరగడం వివాదాస్పదమైంది. దీనిపై..

శృతిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

శృతిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

అనుమతికి అవకాశమే లేని చోట శృతి హాసన్ పోలింగ్ బూత్ లోకి అక్రమంగా ప్రవేశించారని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది క్రిమినల్ చర్య కిందికి వస్తుందని, వెంటనే ఆమెపై కేసు నమోదుకు ఆదేశాలివ్వాలంటూ కోయంబత్తూరుకు చెందిన బీజేపీ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోయంబత్తూ సౌత్ నియోజకవర్గంలో కమల్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్ ఈ మేరకు ఈసీకి లేఖ రాశారు. పోలింగ్ కేంద్రంలోకి బూత్ ఏజెంట్లు, ఓటర్లు తప్ప బయటి వ్యక్తులు వెళ్లరాదనే నిబంధనను ఉల్లంఘించిన శ్రుతీహాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే

 రీపోలింగ్‌కు కమల్ డిమాండ్

రీపోలింగ్‌కు కమల్ డిమాండ్

అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం సీటులో బీజేపీ పోటీకి దిగింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా స్థానికంగా పర్యటించిన ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ తన ప్రత్యర్థిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరు పంపిణీ చేశారో ఆధారాలు సహా తన వద్ద ఉన్నాయని, ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రీపోలింగ్‌కు పట్టుబడుతామని, ఒక్క కోవై దక్షిణంలోనే కాదు, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఈ తంతు సాగినట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కోబ్రా జవాన్ రాకేశ్వర్ సేఫ్, ఇదిగో ఫోటో -మావోయిస్టుల అనూహ్య ఎత్తుగడలు -అడవిలోకెళ్లిన మధ్యవర్తులుకోబ్రా జవాన్ రాకేశ్వర్ సేఫ్, ఇదిగో ఫోటో -మావోయిస్టుల అనూహ్య ఎత్తుగడలు -అడవిలోకెళ్లిన మధ్యవర్తులు

English summary
BJP has filed a complaint against Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan’s daughter Shruti Haasan, accusing her of trespassing into a polling booth where she was accompanying her father for booth visit in Coimbatore South. other side, Kamal Haasan Files Complaint Against BJP for Distributing ‘Tokens’ Ahead of Polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X