వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపినియన్ పోల్: హిమాచ్‌ప్రదేశ్‌లో‌నూ బీజేపీదే అధికారం

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టనుంది. నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో వీరేభద్రసింగ్ నాయతక్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టనుంది. ఈ మేరకు ఇండియా టూడే-ఆక్సిస్ మైఇండియా

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టనుంది. నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో వీరేభద్రసింగ్ నాయతక్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టనుంది. ఈ మేరకు ఇండియా టూడే-ఆక్సిస్ మైఇండియా ఓపినియన్ పోల్ వెల్లడించింది.

ఈ పోల్ ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాల్లో బీజేపీ 43-47 సీట్లు దక్కించుకోనుంది. అంటే మెజార్టీ మార్కు(35) బీజేపీ సులభంగానే దాటనుందన్నమాట. ఇక కాంగ్రెస్ మాత్రం 25-21సీట్లకు పరిమితం కానుందని ఓపినియన్ పోల్ వెల్లడించింది. ఇతర పార్టీలు, స్వతంత్రులకు రెండు సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది.

BJP set for big win in Himachal: India Today-Axis My India opinion poll

2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీరభద్రసింగ్ నేతృత్వంలో 36 సీట్లను దక్కించుకుంది. బీజేపీకి అప్పుడు 26సీట్లు వచ్చాయి. ఆరోసారి సీఎంగా వీరభద్రసింగ్ ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు.

కాగా, రాష్ట్రంలో బీజేపీకి 49శాతం ఓటింగ్ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి 38శాతం ఓట్ షేర్ ఉంది. కాంగ్రా, మాండి, షిమ్లాలో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నప్పటికీ.. సీఎం వీరభద్రసింగే రాష్ట్రంలో ప్రజాదరణ నేతగా ఉండటం గమనార్హం. 38శాతం మంది ప్రజలు ఆయనకు మద్దతు పలికారు. జేపీ నడ్డా, ప్రేమ్ కుమార్ ధూమాల్, ఇతర నేతలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఉద్యోగిత అంశమే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉండబోతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

English summary
BJP will register victory in the November 9 Himachal Pradesh Assembly elections by defeating the Congress government led by Chief Minister Virbhadra Singh, an opinion poll conducted by India Today-Axis My India has indicated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X