వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ హీట్ : విడుదలకు ముందే వివాదంలో "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్"

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్". ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల అవడంతో రాజకీయంగా అగ్గి రాజుకుంటోంది. అనుపమ్ ఖేర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైందంటూ బీజేపీ ట్వీట్ చేసింది. 10 ఏళ్ల పాటు దేశం ఒక కుటుంబం గుప్పిట్లో ఎలా ఉంచుకుంది.. ప్రధాని పదవికి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని సిద్ధ పరిచేవరకు మన్మోహన్ సింగ్‌ను పావులా వాడుకున్నారా..? అధికారిక ట్రైలర్ విడుదలైంది. చూడండి అంటూ బీజేపీ ట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ ఇలా వ్యవహరించడం సరికాదని హెచ్చరించాయి.

BJP Shares Trailer of The Accidental Prime Minister on Twitter, Netizens Ask Why

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుడిగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించారి విడుదలకు ముందే చిత్రాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ట్వీట్ చేసిన వెంటనే పోస్టు వైరల్ అయ్యింది. దీంతో నెటిజెన్లు బీజేపీని విమర్శించారు. బాలీవుడ్ సినిమాలు ట్వీట్ చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందా అంటూ కొందరు ప్రశ్నించారు. అంతేకాదు ఇక నుంచి వచ్చే ఇతర చిత్రాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా బీజేపీ రివ్యూతో పోస్టు చేస్తే బాగుంటుందని మరికొంతమంది నెటిజెన్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ 134వ వార్షికోత్సవ వేడుకలకు ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్న మన్మోహన్ సింగ్‌ను మీడియా చిత్రం గురించి అడిగింది. అయితే దీనిపై మాట్లాడేందుకు మన్మోహన్ సింగ్ నిరాకరించారు. అప్పటి వరకు ఏదో మాట్లాడాలని మైకులు ముందు నిల్చున్నారు మన్మోహన్ సింగ్. తనపై వస్తున్న సినిమా గురించి ఏమనుకుంటున్నారు అని మీడియా వారు అడగగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు మన్మోహన్ సింగ్.

English summary
The Bharatiya Janata Party is facing a lot of flak on Twitter after tweeting the trailer of the upcoming film 'The Accidental Prime Minister'.Based on a book of the same name by former Prime Minister Manmohan Singh's then media adviser Sanjaya Baru, the trailer of the Anupam Kher-starrer has already begun to ruffle feathers with many in the Congress accusing it of misrepresenting facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X