India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ మొండిచెయ్యి: మహిళా మంత్రికి సైతం నో టికెట్

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం, ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఇంకో మూడు రోజుల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ఆరంభం కానుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. తొలిదశలో ఉత్తర ప్రదేశ్‌లో 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

UP Elections 2022: రంగంలోకి Star Campaigners|BJP VS SP VS Congress | Oneindia Telugu

త్వరలో మూడు రాజధానులు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు: కొత్త జిల్లాలతో పాటుత్వరలో మూడు రాజధానులు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు: కొత్త జిల్లాలతో పాటు

14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో- నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్‌ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్‌లో అధికారాన్ని రావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అకాలీదళ్ తెగదెంపులు చేసుకోవడం బీజేపీకి విఘాతంలా పరిణమించింది.

 BJP sitting MLA Surendra Singh to contest as an independent candidate after he has been dropped

ఉత్తర ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేసింది. ఆచితూచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తోంది. వివాదాస్పదులను దూరం పెడుతోంది. నియోజకవర్గాన్ని పట్టించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడాన్ని నిరాకరిస్తోంది. వారిని మరోసారి బరిలో దింపడానికి ఏ మాత్రం సుముఖంగా ఉండట్లేదు. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పలువురు సిట్టింగుల పేర్లు గల్లంతయ్యాయి.

45 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అగ్రనాయకత్వం విడుదల చేసింది. మంత్రి స్వాతి సింగ్‌కు సైతం షాక్ ఇచ్చింది. ఆమెకు టికెట్ ఇవ్వలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ సారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. దీనితో ఆమె సమాజ్‌వాది పార్టీలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనితో బీజేపీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.

స్వాతి సింగ్ భర్త దయాశంకర్ సింగ్‌కు టికెట్ కేటాయించింది. ఆయనకు బల్లియా జిల్లాలోని బల్లియా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను కేటాయించింది. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మొత్తం 10 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌కు టికెట్ ఇవ్వలేదు బీజేపీ అధిష్ఠానం. బలియా జిల్లాలోని బైరియా అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు. ఈ సారి ఆయనకు టికెట్ దక్కలేదు. బైరియా స్థానంలో మరొకరిని నిలబెట్టింది.

దీనితో తాను బైరియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థుడిగా పోటీ చేస్తానని సురేంద్ర సింగ్ ప్రకటించారు. అలాగే- అమేథీ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్‌‌ను తప్పించింది. ఆమె భర్త సంజయ్‌ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. సంజయ్ సింగ్ ఇదివరకు కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఇటీవలే కాంగ్రెస్ బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆర్పీఎన్ సింగ్‌కు కూడా టికెట్ ఇవ్వలేదు.

English summary
Notably, the sitting Bairia MLA Surendra Singh, who has been in news often for making controversial remarks and speaking against the state government, has been dropped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X