వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదం: చికెన్ తిని ఆలయాన్ని దర్శించుకున్న రాహుల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారాల సందర్భంగా భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇటీవల ఆయన తరచుగా ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే ఆలయాలను సందర్శిస్తుండటంతో.. రాహుల్ గాంధీని 'ఎన్నికల హిందువు'గా ఎద్దేవా చేస్తోంది బీజేపీ. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించుకోవడం ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తుంది.

BJP Slams Rahul Gandhi For Visiting Temple ‘After Eating Chicken’

తాజాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కూడా పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. అయితే, చికెన్‌ తినిమరీ ఆలయాలను దర్శించుకుంటున్నారని బీజేపీ.. రాహుల్‌పై మండిపడుతోంది.

'ఓ వైపు 10శాతం సీఎం సిద్ధరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థలం మంజునాథుడిని దర్శించుకుంటే.. మరో వైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్ గాంధీ జవారీ చికెన్ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు' అని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ట్విట్టర్ వేదిక విమర్శించారు.

Recommended Video

Rahul Gandhi Tweets Supporting AP MPs Protest in Parliament

'హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాయపరుస్తోంది? ఆ పార్టీది సమాజవాదం కన్నా మజావాదం(ఎంజాయ్ చేయడం) ఎక్కువ కనిపిస్తోంది' అని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ నరసింహస్వామిని దర్శించుకున్న పొటోలను ఆయన ట్వీట్ చేశారు. కాగా, గతంలో చేపల కూరతో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మంజునాథ ఆలయాన్ని దర్శించుకోవడం వివాదాస్పదమైంది.

English summary
Karnataka BJP chief B S Yeddyurappa today hit out at Congress President Rahul Gandhi for reportedly visiting a temple after eating "Javari chicken" during his ongoing tour of northern parts of the poll-bound state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X