వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రుఘ్న సిన్హాకు షాకిచ్చిన బీజేపీ: తెరపైకి సుశీల్ మోడీ

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగుతూనే మరో వైపు ఆ సొంత పార్టీపైనే తరచూ విమర్శలు ఎక్కుపెట్టే శత్రుఘ్న సిన్హాకు ఆ పార్టీ గట్టి షాకిచ్చింది. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీని బీజేపీ బరిలో దించనుంది.

పార్టీ కీలక నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర కేబినెట్‌లోకి తనను తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్న సిన్హా కొంత కాలంగా ప్రధాని మోడీ, పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో గళం విప్పారు.

BJP snubs Shatrughan Sinha, Sushil Modi to contest from Patna Sahib seat: Sources

2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న శత్రుఘ్న సిన్హాకు సుశీల్ కుమార్ మోడీ తెరపైకి తేవడం ద్వారా చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే, చివరి సమయం వరకు వేచి చూడాల్సిందే.

English summary
Bihar Deputy Chief Minister Sushil Kumar Modi will be the Bharatiya Janata Party (BJP) candidate for the next Lok Sabha election from Patna Sahib. Shatrughan Sinha, the current Lok Sabha MP from Patna Sahib, will not get the ticket to contest the election following his anti-party stand over a host of issues, sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X