వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికను తప్పిపట్టిన పారికర్ కుమారుడు.. ఎందుకో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

పనాజీ : గోవా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత చంద్రకాంత్ కవలేఖర్‌తోపాటు చేరడంతో హస్తం పార్టీకి కొలుకోలేని దెబ్బ. కానీ దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ మాత్రం బీజేపీ చర్యను తప్పుపట్టారు. ఇది సరికాదంటూనే .. తన తండ్రి చనిపోయాక గోవా బీజేపీ విలువలకు తిలోదకాలు ఇవ్వడం మొదలెట్టిందని మండిపడ్డారు. పారికర్ కుమారుడి వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి కాసింత కలవరానికి గురిచేశాయి.

కారణమిదీ ..
ఉత్పల్ వ్యాఖ్యలు ఊరికేనే చేయలేదు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. మనోహర్ పారికర్ చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన భావించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అటనాసియో గెలుపొందారు. దీంతో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు దోహదపడ్డారని భావించారు. ఇదిలా ఉంటే నిన్న 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. వారిలో అటానసియా కూడా ఉండటంతో ఉత్పల్ ఆగ్రహానికి కారణమైంది.

‘BJP taken different direction’: Parrikar’s son strikes discordant note on Goa

గోవా బీజేపీలో రాజకీయాలు కలుషితమయ్యాయని ఉత్పల్ పేర్కొన్నారు. మార్చి 17 తర్వాత ఆ పార్టీ నేతలు చర్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 17 గోవా సీఎం మనోహర్ పారికర్ చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పార్టీ విభన్న కోణంలో ముందుకెళ్తుందని ఉత్పల్ ఆరోపించారు. కానీ తాను మాత్రం పార్టీని వీడబోనని స్పష్టంచేశారు. పార్టీలో ఉన్న సీనియర్లకు చేదోడు వాదోడుగా ఉంటానని స్పష్టంచేశారు. అయితే అటనాసియో బీజేపీలోకి చేరడంపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. అంతేకాదు వచ్చే రెండేళ్లలో ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయన అనుచరులకే తెలియదని విమర్శించారు.

English summary
Reacting sharply to ten Congress MLAs joining the BJP in Goa, Utpal Parrikar, son of late Manohar Parrikar, said Wednesday that the saffron party has “taken a different direction” after his father’s demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X