చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి బిగ్ షాక్: ప్రతిపక్ష పార్టీలో చేరిన పార్టీ ఉపాధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష డీఎంకేలో చేరారు. గురువారం ఉదయం చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను కలిశారు. పార్టీ కండువా కప్పుకొన్నారు. తమిళనాడులో బల పడటానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేపట్టిన బీజేపీ అధిష్ఠానానికి.. ఈ పరిణామం విఘాతంలా మారిందని అంటున్నారు.

YS Jagan: విస్తరణకు అవకాశం ఇస్తాం: పెట్టుబడులు పెట్టండి: కియా మోటార్స్ ప్లాంట్ లో వైఎస్ జగన్YS Jagan: విస్తరణకు అవకాశం ఇస్తాం: పెట్టుబడులు పెట్టండి: కియా మోటార్స్ ప్లాంట్ లో వైఎస్ జగన్

అన్నా డీఎంకే ఆసరాతో తమిళనాడులో పాగా వేయాలనుకున్నా..

అన్నా డీఎంకే ఆసరాతో తమిళనాడులో పాగా వేయాలనుకున్నా..

దక్షిణాదిన కర్ణాటక మినహాయిస్తే.. మరే రాష్ట్రంలోనూ బీజేపీ మూలాలు ఆశించిన స్థాయిలో బలంగా లేవు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ తరువాత కొద్దో, గొప్పో బలంగా ఉన్నది తెలంగాణలోనే. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళల్లో కమలనాథులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమిళనాడులో పాగా వేయడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా..బీజేపీ అధిష్ఠానం మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ అన్నా డీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే.

అధికార పార్టీ అండదండలు ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమి..

అధికార పార్టీ అండదండలు ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమి..


అయినప్పటికీ..ఫలితాలు అన్నా డీఎంకే-బీజేపీ కూటమికి చుక్కలు చూపించాయి. 39 లోక సభ స్థానాలు ఉన్నా తమిళనాడులో డీఎంకే 36 సీట్లను గెలుచుకోగలిగింది. ఈ పరిస్థితుల్లో బీటీ అరసుకుమార్ పార్టీని వీడటం మింగుడు పడని అంశంగా భావిస్తున్నారు తమిళనాడు బీజేపీ నాయకులు. పార్టీతో పోల్చుకుంటే అరసుకుమార్ కు పెద్ద ఎత్తున సొంత క్యాడర్ ఉందని, వారంతా డీఎంకే వైపు మొగ్గు చూపడం ఖాయమని చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతను ప్రశంసించిన బీజేపీ సీనియర్

ప్రతిపక్ష నేతను ప్రశంసించిన బీజేపీ సీనియర్

కొద్దిరోజుల కిందట పుదుక్కోట్టై లో ఓ బహిరంగ సభలో అరసుకుమార్ డీఎంకే అధినేత స్టాలిన్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ సారి తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్టాలినే నంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కావడానికి గల అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయనీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సంజాయిషీ నోటీసులను జారీ చేసింది. దీనితో మనస్తాపం చెందిన అరసుకుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు.

 వ్యక్తిగతంగా కరుణానిధి, స్టాలిన్ అభిమానిని..

వ్యక్తిగతంగా కరుణానిధి, స్టాలిన్ అభిమానిని..

డీఎంకే తన మాతృ పార్టీ అని, 20 ఏళ్లుగా తాను కరుణానిధి, స్టాలిన్ లను అభిమానిస్తున్నానని చెప్పారు. అది తన వ్యక్తిగతమే అయినప్పటికీ.. రాజకీయంగా తాను స్టాలిన్ ను శతృవుగానే భావిస్తానని అన్నారు. అయినప్పటికీ.. తాను వ్యక్తిగతంగా మాత్రమే స్టాలిన్ ను ప్రశంసించానని, అయినప్పటికీ.. తనకు సంజాయిషీ నోటీసును జారీ చేయడం బాధ కలిగించిందని అరసుకుమార్ చెప్పారు. అందుకే బీజేపీని వీడాల్సి వచ్చిందని అన్నారు.

సొంత క్యాడర్ ఉన్న నేతలేరీ..?

సొంత క్యాడర్ ఉన్న నేతలేరీ..?

తాజాగా తమిళనాడు చోటు చేసుకున్న పరిణామాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్లు మాత్రమే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లలేకపోతే.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయనే ఆందోళన నెలకొంది. అరసకుమార్ వంటి సొంత క్యాడర్ ఉన్న నాయకులు పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అధికార అన్నా డీఎంకే సైతం గ్రామ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతోందని, సొంతంగా బలపడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు.

English summary
Tamil Nadu BJP unit vice president BT Arasakumar joined the DMK on Thursday in the presence of party president MK Stalin at the party headquarters in Chennai Arivalayam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X