యథా రాజా- తథా ప్రజ- రాహుల్ గాంధీని మరో వీడియోతో ఆడుకుంటున్న బీజేపీ
కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న వీడియోల పోరులో మరో అంకం చోటు చేసుకుంది. నాగ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ నేతల శిక్షణా శిబిరంలో కార్యకర్తలు డాన్సులు వేస్తున్న దృశ్యాలు ఇప్పుడు బీజేపీకి వరంగా మారాయి. తాజాగా పార్టీ నేత రాహుల్ గాంధీ నేపాల్ లో నైట్ పార్టీలో పాల్గొన్న దృశ్యాల వీడియోను వైరల్ చేసిన బీజేపీ.. ఇఫ్పుడు నాగ్ పూర్ వీడియోతో మరోసారి రాహుల్ ను టార్గెట్ చేస్తోంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా నాగ్ పూర్ లో కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో కార్యకర్తలు డ్యాన్సులు వేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్.సి)ని ఐ నీడ్ సెలబ్రేషన్ అంటూ అభివర్ణిస్తూ ఈ విడియోను పోస్ట్ చేశారు. అంతే కాదు యథా రాజా తథా ప్రజా అంటూ మరో కోట్ కూడా దానికి తగిలించారు. దీంతో ఇప్పుడు ఈ వీడియోను బీజేపీ శ్రేణులు వైరల్ చేసే పనిలో ఉన్నాయి.

నేపాల్ నైట్ క్లబ్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వీడియోపై వివాదం రేగిన నేపథ్యంలో కాంగ్రెస్ పై మరోసారి బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో పోరాడుతున్నప్పుడు కూడా నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ యువ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని పేర్కొంటూ కాషాయ పార్టీ ఈ వీడియోను విడుదల చేసింది.
After Rahul Gandhi’s pub video, another Congress Party video surfaces.
— Aditya khemka 🇮🇳 (@Adityakhemka16) May 12, 2022
BJP releases video of Maha youth Congress party. BJP's (@Shehzad_Ind) reacts to this video, says, “Their (Congress) priority is not public. Their priority is pub and party.”@Chaiti pic.twitter.com/HXak73Jirw
ఈ
వీడియోను
పోస్ట్
చేస్తూ
బీజేపీ
అధికార
ప్రతినిధి
పూనావాలా
"మహారాష్ట్ర
ప్రదేశ్
యూత్
కాంగ్రెస్
కొత్త
ఆఫీస్
బేరర్ల
'శిక్షణ?
పార్టీ?
క్యాంపు'!
వీడియో
చూడండి
&
పాటలు
వినండి!
నేపాల్
పబ్‌లో
రాహుల్,
"పార్టీ
ట్రైనింగ్"
క్యాంపులో
జూనియర్
నేతలు.
జైసా
నేత
వైస్
ఫాలోయర్
(నాయకుని
ఎలా
ఉంటే,
అనుచరుల
అలా
)
అంటూ
కామెంట్స్
పెట్టారు.