వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో బీజేపీ నిరసన .. కార్యకర్తల హత్యలను ఖండిస్తూ ర్యాలీ ...

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో బెంగాల్ రణరంగంగా మారింది. ఇటీవల వరుసగా దాడులు, ప్రతీదాడులతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. నిన్న భాత్పూరలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణం మీరంటూ మీరేనని .. టీఎంసీ, బీజేపీ విమర్శించుకున్న సంగతి తెలిసిందే.

నిరసనగా ..
బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్తల ఆగడాలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. గురువారం భాత్పూరలో మరో ఇద్దరు కార్యకర్తలు చనిపోవడంతో నిరసన తెలుపున్నట్టు ప్రకటించింది. ఇద్దరు బీజేపీ కార్యకర్తల అంత్యక్రియలకు బరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ హాజరై .. కడసారి వీడ్కోలు పలికారు. తమ కార్యకర్తల మృతితో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ముకుల్ రాయ్, లాకెట్ ఛటర్జీతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం రేపు భాత్పూరలో పర్యటిస్తోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Recommended Video

ఇక నుంచి మా పార్టీలోకి చేరికలు స్టార్ట్ అవుతాయ్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
BJP to take out protest march in Kolkata against Bengal violence that killed 2

144 సెక్షన్ విధింపు ...
టీఎంసీ, బీజేపీ నేతలకు గురువారం జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోగా .. 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో 144 సెక్షన్ విధించారు. ఘటనస్థలాన్ని డీజీపీ వీరేంద్ర పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలం నుంచి బాంబులు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. భాత్పూరలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు టీఎంసీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్‌గా ఉన్నారు. దాడిచేసిన వారిని వదలొద్దని .. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దాడితో సంబంధం ఉన్న ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. అంతేకాదు శాంతిభద్రతలు అదుపుతప్పి విధ్వంసకాడకు దారితీయడంతో బరక్‌పుర్ పోలీసు కమిషనర్‌పై బెంగాల్ సర్కార్ బదిలీ వేటు వేసింది. డార్జిలింగ్ ఐజీపీ మనోజ్ కుమార్ వర్మకు సీపీ బాధ్యతలు అప్పగించింది.

English summary
day after two people were killed in violent clashes in Bengal's Bhatpara and BJP and Trinamool Congress blamed each other, BJP will be conducting a protest march in Kolkata against the violence. Meanwhile, Barrackpore BJP MP Arjun Singh will be attending the funeral of two persons who died in the violence in Bhatpara on Thursday. A BJP delegation is likely to visit the area in Bhatpara on Saturday. The entire Bengal BJP leadership, including state president Dilip Ghosh and Mukul Roy, Mahila Morcha chief Locket Chatterjee and others are in Delhi for Yoga Day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X