వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్, ఫేస్‌బుక్‌లో ప్రచారానికి పార్టీలు ఎంత ఖర్చు చేశాయో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. రాజకీయ నాయకులు ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయకతప్పని పరిస్థితి. కాలంతో పాటు క్యాంపెయినింగ్‌లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇంటింటి ప్రచారానికి పరిమితమైన నేతలు ఇప్పుడు డిజిటల్ మోడ్‌లోకి వెళ్లారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో గూగుల్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం రాజకీయ పార్టీల కోట్ల రూపాయలు వెచ్చించాయి. ఈ వ్యయంలో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది.

మోడీ లెక్క పక్కా: ఆ ఇద్దరి ట్రాప్‌లో వారంతా విలవిల..అసలు జరిగిందేంటి..?మోడీ లెక్క పక్కా: ఆ ఇద్దరి ట్రాప్‌లో వారంతా విలవిల..అసలు జరిగిందేంటి..?

డిజిటల్ యాడ్స్‌ కోసం రూ.53 కోట్లు

డిజిటల్ యాడ్స్‌ కోసం రూ.53 కోట్లు

డిజిటల్ ప్లాట్ ఫాంలపై పొలిటికల్ పార్టీ ఇచ్చిన ప్రకటనలకు రాజకీయ పార్టీలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు దాదాపు రూ.53కోట్లు ఖర్చు చేశాయి. ఈ ప్రకటనల ఖర్చులో సింహభాగం బీజేపీదేనని యాడ్ లైబ్రరీ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మే 15 వరకు ఫేస్‌బుక్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 1.21 లక్షల ప్రకటనలు పోస్టుకాగా... వీటికోసం అక్షరాలా రూ.26.5కోట్లు ఖర్చు చేశాయని యాడ్ లైబ్రరీ చెప్పింది. ఇక గూగుల్, యూట్యాబ్‌లలో ప్రకటన కోసం పొలిటికల్ పార్టీలు ఫిబ్రవరి 19 నుంచి మే 15 వరకు రూ. 27.36కోట్లు ఖర్చు చేశాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ రూ.29.28లక్షలు, ఆమ్ ఆద్మీ పార్టీ 13.62 లక్షలు ఫేస్‌బుక్‌కు చెల్లించాయి.

డిజిటల్ యాడ్స్‌పై బీజేపీ టాప్

డిజిటల్ యాడ్స్‌పై బీజేపీ టాప్

పార్టీలవారీగా చూస్తే ఎన్నికల సమయంలో డిజిటల్ యాడ్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన లిస్టులో బీజేపీ మొదటి స్థానంలో ఉంది. డిజిటల్ ప్రచారం కోసం ఆ పార్టీ రూ.21.23 కోట్లు ఖర్చు చేసింది. ఫేస్‌బుక్‌లో యాడ్స్ కోసం రూ. 4.23కోట్లు వెచ్చించగా... గూగుల్‌లో ప్రకటనల కోసం రూ.17కోట్లుపైగా చెల్లించింది. ఎన్నికల సీజన్‌లో ఫేస్‌బుక్‌లో 3, 686 యాడ్స్ పోస్ట్ చేసిన కాంగ్రెస్.. డిజిటల్ క్యాంపెయినింగ్ కోసం రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసింది. యాడ్స్ కోసం ఆ పార్టీ ఫేస్‌బుక్‌కు రూ.1.46కోట్లు, గూగుల్‌కు రూ.2.71 కోట్లు చెల్లించింది.

900లకుపైగా పోస్ట్‌లు డిలీట్

900లకుపైగా పోస్ట్‌లు డిలీట్

ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన రాజకీయపార్టీలకు సంబంధించి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు 909 పోస్ట్‌లను తొలగించాయి. ఫేస్‌బుక్ 650, ట్విట్టర్ 220, షేర్‌చాట్ 31, యూ ట్యూబ్ 5, వాట్సప్ 3 పోస్టులను తొలగించాయి.

English summary
Political parties have spent over ₹53 crore on digital platforms like Google and Facebook between February and May, with the BJP accounting for a lion’s share of the spending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X