వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణం పోయినా సాయం చేసేందుకు లెక్కచేయలేదు, కార్యకర్తలకు అండగా ఉంటాం: మోడీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సాయం చేద్దామనే బీజేపీ కార్యకర్తలు ముందుకొచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఒకరి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించి.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రజల ప్రాణం కాపాడేందుకు నిస్వార్థంగా పనిచేశారని కొనియాడారు. కరోనా వైరస్ సందర్భంగా సేవలు అందించే సమయంలో కొందరు కార్యకర్తలు విలువైన ప్రాణాన్ని కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను అండగా నిలువాలని పార్టీని కోరుతున్నానని చెప్పారు. నిస్వార్థంగా పనిచేయడమే తమ ఉద్దేశ్యమని.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తుంటే కలిగే ఆనందమే వేరు అని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. వలసకూలీలను బీజేపీ కార్యకర్తలు తమ సొంత మనుషులుగా భావించారని తెలిపారు.

3 నెలలుగా..

3 నెలలుగా..

గత 3 నెలలుగా వారికి అన్నం పెడుతున్నారని చెప్పారు. ఇదీ నిస్వార్థమైన సేవ అని.. మంచి, పబ్లిషిటీ కోసం కాదు అని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పనిని చూసి తాను గర్వపడుతున్నానని మోడీ అభిప్రాయపడ్డారు. మనం కేవలం ఎన్నికల్లో గెలిచే మిషన్లు కాదు అని.. సేవ చేయడమే మన బాధ్యత అన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పని చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజకీయ నేతలు మాట్లాడుతారని.. కానీ బీజేపీ మాత్రం సేవ అందిస్తోందని తెలిపారు. తమ పార్టీ సిద్దాంతాలతో ఆవిర్భవించిందని మోడీ తెలిపారు. అందుకోసమే తమకు ప్రజలంతా సమానమేనని తెలిపారు. బీజేపీలో దళితులు, బీసీలు, ఆదివాసీలకు చెందిన ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు. టీం స్పిరిట్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. బీజేపీ చేస్తున్న సేవలను సమాజం గుర్తించిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తమ సేవలు కొనసాగుతాయని మోడీ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో జేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు.

రాజీలేని పోరాటం..

కరోనా వైరస్‌పై బీజేపీ కార్యకర్తలు పోరాడుతున్నారని జేపీ నడ్డా తెలిపారు. నడ్డా మాట్లాడటంతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్పరెన్స్ ప్రారంభించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రసంగిస్తోన్న ప్రధాని మోడీకి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌పై ఎలా పోరాడాలే తమకు ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ సమయంలో ఎలా ఉండాలో మార్గనిర్దేశనం చేశారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని.. ఇదీ డిజిటల్ ఇండియాలో భాగమని తెలిపారు. 3 నెలల్లో 4 వేల కాల్స్ చేశామని చెప్పారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలతో మమేమకయ్యామని పేర్కొన్నారు.

మోడీ రేషన్ కిట్

బీజేపీ కార్యకర్తలు మోడీ రేషన్ కిట్ పేరుతో పేదలకు పంచారని నడ్డా తెలిపారు. ఇలా వేలాది మందికి సరుకులు అందజేశారన్నారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో 8 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు అవగాహన కల్పించారని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. వలసకూలీలకు కూడా బీజేపీ కార్యకర్తలు సాయం చేశారని నడ్డా తెలిపారు. మహారాష్ట్రలో కొన్ని ఆస్పత్రులను బీజేపీ కార్యకర్తలు శుభ్రపరిచారని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కూడా సాయం చేశారని తెలిపారు. విపత్తులో ఉన్న సమయంలో జాతికి సాయం చేశామని, ఇందుకు తమకు మద్దతిచ్చిన ప్రధాని మోడీకి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం ఏ విధంగా పనిచేశాయో 7 రాష్ట్రాలు ప్రజంటేషన్ ఇస్తాయని నడ్డా తెలిపారు.

అధికారం ఉన్నా.. లేకున్నా..

తొలుత రాజస్తాన్ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. తాము ప్రజలతోపాటు జంతువులకు కూడా సాయం చేశామని తెలిపారు. రాజస్తాన్‌లో తాము అధికారంలో ఉన్నా, లేకున్నా.. ప్రజల కోసం పోరాడామని తెలిపారు. మహారాష్ట్ర యూనిట్ నుంచి ప్రజలు ఆరోగ్య సేత యాప్ ఉపయోగించాలని చెప్పారు. మాస్క్‌లు తయారుచేసి, పంపిణీ చేశామన్నారు. అవసరమైన చోట బీజేపీ కార్యకర్తలు తమ ఉదారత చాటుకొన్నారని తెలిపారు. మొహానికి మాస్క్ వేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించామని బీహార్ యూనిట్ తెలిపింది. తమ రాష్ట్రానికి శ్రామిక్ రైలు నడపడంపై బీహార్ యూనిట్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపింది. ఆకలితో అలమటించిన వారికి ఆహార ప్యాకెట్లను అందజేశామని తెలిపారు. వలసకూలీలకు తమ సాయం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

ఆదిర్ రంజన్ చౌదరి ట్వీట్‌తో..

కరోనా వైరస్ నివారణ కోసం తీసుకున్న చర్యలను ఢిల్లీ బీజేపీ చీఫ్ ప్రధాని మోడీకి వివరించారు. పార్టీలకతీతంగా సాయం చేశామని చెప్పారు. కాంగ్రెస్ నేత ఆదిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేయగా... బీజేపీ కార్యకర్తలు సాయం చేశారని వివరించారు. ఈ విషయాన్ని అప్పుడే ఢిల్లీ బీజేపీ యూనిట్ ప్రధాని మోడీకి సమాచారం అందజేసిందని చెప్పారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం కర్ణాటకలో బీజేపీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తునారని తెలిపారు. వారికి ఆడియో, వీడియో సందేశాలు పంపించి.. అవగాహన కల్పించామని చెప్పారు. 47 లక్షల ఆహార ప్యాకెట్లను అందజేశామన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో 98 శాతం విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను ప్రధాని మోడీ అభినందించారు.

Recommended Video

TikTok CEO To India Employees | TikTok కు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది, ఉద్యోగులకు భరోసా!

అవిశ్రాంత శ్రమ..

కరోనా వైరస్ సందర్భంగా అసోంలో తీసుకున్న చర్యలను ఆ పార్టీ చీఫ్ ప్రధాని మోడీకి వివరించారు. వైరస్ నుంచి గట్టేందుకు కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేశారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరోనా వైరస్ సందర్భంగా తీసుకున్న చర్యలను యూపీ బీజేపీ చీఫ్ ప్రధాని మోడీకి వివరించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ.. బీజేపీ కార్యకర్తలను అభినందించారు. కరోనా కష్టకాలంలో బీజేపీ కార్యకర్తలు చేసిన సాయాన్ని డిజిటల్ బుక్ తీసుకొద్దామని మోడీ తెలిపారు. దిన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సెప్టెంబర్ 25వ తేదీన డిజిటిల్ బుక్ విడుదల చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, మాతృభాషలో పుస్తకం ఉంటుందని తెలిపారు.

English summary
PM Modi adrressed the BJP workers on the lines of Covid-19. Modi hailed the workers for their contribution in fighting the pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X