వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసంఘ్ నుండి ఉన్న ప్రతిపాదన... ఇది సాహసోపేతమైన నిర్ణయం : అద్వాని

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించిన ఆర్టికల్ 370,35ఏలను తోలగించడంతో ప్రధాన మంత్రి మోడీ తీసుకున్న నిర్ణయానికి బీజేపీ సీనియర్ నేతల మద్దతు కూడ లభించింది. పార్టీ నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి మోడీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేతలు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

మోడీ, అమిత్ షాలను అభినందించిన అద్వాని

మోడీ, అమిత్ షాలను అభినందించిన అద్వాని

జమ్ము అండ్ కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ఆర్టికల్సను తొలగించడంపై బీజేపీ సినియర్ నేత ఎల్‌కే అద్వాని స్పందించారు. ఆర్టికల్, 370,35ఏలను తొలగించడం సహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ సంధర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమత్రి అమిత్ షాలను ఆయన అభినందించారు. దీంతో రద్దుపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జనసంఘ్ నుండి ప్రతిపాదన...

జనసంఘ్ నుండి ప్రతిపాదన...

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్స్ తోలగింపును బీజేపీ సినియర్ నేత అద్వాని స్వాగతించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయం ఓ సహసోపేతమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయం జాతీయ సమైక్యతకు,సమగ్రత బలోపేతానికి ఇది తోడ్పడుతుందని ఆయన అయన అన్నారు. ఇది గోప్ప ముందడుగా అభివర్ణించారు. ఈనేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లో ఉన్నా ఆర్టికల్స్ తోలగింపు భారతీయ జనతా పార్టీ మూల సిద్దాంతాల్లో ఒకటని ఆయన పేర్కోన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి ముందే ఏర్పడిన జనసంఘ్ ఎర్పడినప్పటి నుండే తోలగింపు ప్రతిపాదన ఉందని తెలిపారు.

జాతీయ సమైక్యతకు తోడ్పడుతున్న పార్టీ నేతలు

జాతీయ సమైక్యతకు తోడ్పడుతున్న పార్టీ నేతలు

ప్రభుత్వం తీసుకున్న చారీత్రక నిర్ణయం వల్ల జమ్ము మరియు కశ్మీర్‌‌తో పాటు లద్దాక్ ప్రాంతాలు శాంతి సామరస్యాలతో పాటు, ప్రజల్లో సుఖశాంతులు ఏర్పడుతాయని ఆయన తెలిపారు. ఇది చారిత్రక తప్పిదాన్ని అంతం చేసే చర్యగా ఆయన అభివర్ణించారు.రద్దు నిర్ణయం జాతీయ సమైక్యతకు సహాయపడుతుందని పలువురు బీజేపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పెద్దరికాన్ని నిలబెట్టుకున్న అద్వాని

పెద్దరికాన్ని నిలబెట్టుకున్న అద్వాని

వయసురిత్యా ఎల్‌కే అద్వానితోపాటు మరికొంతమంది సినియర్లకు గత ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను కేటాయించని విషయం తెలిసిందే.. గాంధీనగర్ నుండి అద్వానికి బదులుగా బీజేపీ పార్టీ చీఫ్ అమిత్‌ షా రంగలంలోకి దిగి విజయం సాధించాడు. కాగా ఎల్‌కే అద్వాని ఆరుసార్లు ఎంపీగా గెలుపోందాడు. బీజేపీని పలు రథయాత్రలతో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున క‌ృషి చేసిన విషయం తెలిసిందే..అయినా సీటు కేటాయింపులో మోడీపై ఒక్క విమర్శ చేయని నాయకుడు అద్వాని..మొత్తం పార్టీ సిద్దాంతానికి కట్టుబడిన వ్యక్తి ఎల్‌కే అద్వాని ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ నిర్ణయం పై స్పందించి మరోసారి తన పెద్ద రికాన్ని నిలుపుకున్నాడు.

English summary
BJP veteran LK Advani joined the chorus of party leaders in welcoming the government's decision to end Article 370.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X