వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 నుంచి 102.. బెంగాల్‌లో పుంజుకోనున్న బీజేపీ.. అయినా టీఎంసీదే అధికారం.. దీదీనా మజాకా..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరగనుంది. ఈ రెండు పార్టీలు ట్రిపుల్ డిజిట్ దాటుతాయని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే తెలిపింది. అయితే గతంలో కన్నా టీఎంసీ సీట్ల సంఖ్య తగ్గనుంది. 2016లో 211 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ఈ సారి 53 సీట్లు తక్కువగా అంటే.. 148 సీట్లకే పరిమితం కాబోతుందని తెలిపింది. అయితే బీజేపీ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2016లో బీజేపీ కేవలం 3 సీట్లు గెలచుకోగా.. ఈ సారి అదీ 102కు చేరనుంది అని తెలిపింది.

కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు కలిసి 30 సీట్లు గెలుస్తాయని తెలిపింది. 2016లో 46 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 16 సీట్లు తగ్గాయి. ఇతరులు 4 సీట్లను గెలుచుకుంటారు. ఈ సారి బీజేపీ మాత్రం భారీగా సీట్లను గెలుచుకోబోతుంది. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్దమైందని చెప్పొద్దు. ఇటీవల బీజేపీ నేతల పర్యటన కూడా ఇందుకు కలిసి వచ్చింది. అమిత్ షా పదే పదే పర్యటించడం.. నడ్డా కూడా ఫోకస్ చేయడం కారణమయ్యింది.

BJP Vs TMC Showdown In State; Both Parties To Secure Triple Digit Seats

ఏబీపీ పోల్ చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ షాక్‌నకు గురిచేసింది. ఎందుకుంటే ఇటీవల ఆయన బీజేపీ విజయంపై ట్వీట్ చేశారు. డబుల్ డిజిట్ దాటేందుకు శ్రమించాల్సి వస్తోందని చెప్పారు. కానీ బీజేపీ ట్రిపుల్ డిజిట్‌కు చేరడం ఆయనకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ప్రశాంత్ కిశోర్ టీఎంసీ తరఫున వ్యుహాలు రచిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంచనా వేసి.. బీజేపీ గురించి ట్వీట్ చేయగా.. అదీ నిజం కాదని ఏబీపీ చెబుతోంది.

English summary
ABP News C-Voter Opinion Poll 2021: Mamata Banerjee-led Trinamool Congress is likely to be crossing the magic-figure of 148 seats and scraping through to form the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X