వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ బెంగాల్‌ను తగలబెట్టాలని అనుకుంటోంది.. మోడీపై దీదీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అదును దొరికితే చాలు బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నడ్డా కాన్వాయ్‌పై దాడితో అదీ పీక్‌కి చేరింది. తర్వాత అమిత్ షా పర్యటించడం.. బీజేపీలో చేరికలతో రాజకీయం రంజుగా ఉంది. దీంతో మమతా బెనర్జీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని దీదీ ఆరోపించారు. తనపై కోపంతో బెంగాల్‌ను తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అల్లర్లు చెలరేగేందుకు ఉసిగొల్పే అవకాశం ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ, విద్యా సంస్థల్లో గొడవలు చేయాలనుకుంటోందని తెలిపారు. ఇధివరకు ఢిల్లీలో గల జేఎన్‌యూ ఘటనను ఆమె ఉదహరించారు.

BJP wants to torch Bengal through riots: Mamata Banerjee

Recommended Video

JP Nadda Convoy దాడి: 'Planned' Mamata Banerjee Mocks BJP Chief ఘటనపై విచారణకు అమిత్ షా ఆర్డర్ !

గాంధీ జీ సూక్తులను మమతా బెనర్జీ వల్లెవేశారు. ఇదివరకు బెలియఘాటలో అల్లర్లు చెలరేగాయని.. ఆ సమయంలో శాంతిని నెలకొల్పేందుకు గాంధీజీ వచ్చారని తెలిపారు. కానీ తనను రాజకీయంగా టార్గెట్ చేశారని మమతా తెలిపారు. అభిజిత్ బెనర్జీ, అమర్త్యసేన్ మాత్రం వేరు అని చెప్పారు. సమాజంలో వారికున్న స్థానం వేరే అని చెప్పారు. విద్యావేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారని దీదీ ఫైరయ్యారు. ఇదివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ప్రస్తావించిని బీజేపీ.. ఇప్పుడు మాత్రం వల్లెవేస్తుందని వివరించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని దీదీ తేల్చిచెప్పారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Monday alleged that the Narendra Modi government has been targetting her politically and said that the BJP wants to torch the state through riots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X