వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం బలహీనులం! మా పార్టీలోకి రండి: రజనీకాంత్‌కు అమిత్ షా

సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన బీజేపీలో చేరితే ఆహ్వానిస్తామని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన బీజేపీలో చేరితే ఆహ్వానిస్తామని చెప్పారు.

చదవండి: రజనీకాంత్‌పై స్వామి అవమానకర వ్యాఖ్యలు

మేం బలహీనంగా ఉన్నాం, రజనీ రావాలి

మేం బలహీనంగా ఉన్నాం, రజనీ రావాలి

తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉందని, రజనీకాంత్ వస్తే బలపడుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంచి వ్యక్తులకు బీజేపీలో స్థానం ఉంటుందని రజనీ కాంత్ కోసం తలుపులు తెరిచే ఉంటాయన్నారు.

నిర్ణయం రజనీదే

నిర్ణయం రజనీదే

బీజేపీలో చేరాలో? వద్దా అనేది రజనీయే నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సుపరిపాలన గురించి తమిళనాట ప్రచారం చేస్తామని అమిత్ షా తెలిపారు. తమిళనాడులో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.

కేంద్రమంత్రులు కూడా

కేంద్రమంత్రులు కూడా

రజనీని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా బీజేపీలోకి ఆహ్వానించారు. రజనీ లాంటి ప్రజాదరణ ఉన్న హీరోకు బీజేపీయే సరైన స్థానమని చెప్పారు. కాగా, దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ చెప్పిన నేపథ్యంలో షా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

రజనీ నుంచి స్పందన లేదు

రజనీ నుంచి స్పందన లేదు

అయితే బీజేపీ నేతలు ఎంతగా కోరుతున్నా రజనీకాంత్ మాత్రం స్పందించడం లేదు. రజనీ సస్పెన్స్ వీడాలని అమిత్ షా కోరారు. రజనీ బీజేపీలో చేరితే ఆయనను సీఎం అభ్యర్థిగా చేసే అవకాశం ఉంది. రజనీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయనే ప్రాచారం కూడా సాగుతోంది.

English summary
Although it is still not clear whether Rajinikanth would join politics or not, the Bharatiya Janata Party very much want the veteran actor to join them to strengthen its base in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X