వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ సమస్య: పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి వైదోలగడానికి వెనకాడబోమన్న షా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ భద్రత, జాతి ప్రయోజనాలు కాపాడే విషంయలో ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజీ పడబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాద సమస్యను ముఫ్తీ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగడానికి ఎంతమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు.

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ నియమితులైన తర్వాత ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వచ్చేలా చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

అమిత్ షా సైతం జాతి ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదనే విషయాన్ని జమ్మూ ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి హర్షద్ పటేల్ గుజరాత్‌లో మాట్లాడుతూ బీజేపీకి పీడీపీ పొత్తు కంటే జాతి ప్రయోజనాలే ఎంతో ముఖ్యమని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటవాదుల చర్యలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

BJP will quit J&K govt if Kashmir issue not solved: Amit Shah

ఇటీవల కాలంలో ముఫ్తీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు భాగస్వామ్య పార్టీల మధ్య ఇబ్బందులు తలెత్తేలా చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ వేర్పాటువాది ఆలం విడుదల విషయంలో పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.

వేర్పాటువాదులకు ముఫ్తీ అనుకూలండా వ్యవహరిస్తున్నా తీరు సైతం బీజేపీని ఇరకాటంలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలతో కాశ్మీర్‌లో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

English summary
Amidst raging controversy on Jammu and Kashmir government's alleged 'pro-separatist' moves, BJP chief Amit Shah said that his party would not compromise on national interest and could end its alliance with PDP, if "Kashmir issue" is not solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X