వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ సొంతూరులో బీజేపీ ఓటమిపై ట్విస్ట్: 'అసామాన్య విజయం'

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌లో బీజేపీ ఆరోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను మినహాయించి, మరే పార్టీకి ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు. కానీ మోడీ-అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ మరోసారి విజయం సాధించింది.

బీజేపీ సొంత ఊరు వాద్ నగర్ ఉన్న ఉంఝా నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే వాద్ నగర్‌ రెండు నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఇందులో ఓ చోట బీజేపీ, మరోచోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్

ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్

వాద్ నగర్ ఉంఝా నియోజకవర్గంతో పాటు, ఖేరాలు నియోజకవర్గంలోను ఉంది. ఇందులో ఉంఝా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశా పటేల్ గెలిచారు. అహ్మదాబాద్‌కు ఇది దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశాపటేల్ బీజేపీ అభ్యర్థి నారాయణ్ భాయి లల్లుదాస్ పటేల్‌ను ఓడించారు.

రాహుల్ ప్రచారం

రాహుల్ ప్రచారం

గుజరాత్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉమియా మాతా అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఇది వాద్ నగర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌లోనే తన చిన్నతనంలో మోడీ టీ అమ్మారు

మరో నియోజకవర్గంలో బీజేపీ గెలుపు

మరో నియోజకవర్గంలో బీజేపీ గెలుపు

వాద్ నగర్ పట్టణం మెహ్సానా జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది. అందులో ఒకటి ఖేరాలు. రెండు ఉంఝా. ఉంఝాలా కాంగ్రెస్ గెలిచింది. రెండోది అయిన ఖేరాలులో బీజేపీ నేత శంకర్ జీ దాబి గెలుపొందారు.

అప్రమత్తంగా ఉండాలన్న మోడీ

అప్రమత్తంగా ఉండాలన్న మోడీ


గుజరాత్‌లో వరుసగా ఎన్నికల్లో విజయం సాధించడం ఆషామాషీ విషయం కాదనీ, ఇదో అసామాన్య విజయమని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. గుజరాత్‌లో కుల విషాన్ని విరజిమ్మడానికి ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయనీ, అందువల్ల అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ పిలుపునిచ్చారు.

దానిని చిన్నగా చూపే ప్రయత్నం

దానిని చిన్నగా చూపే ప్రయత్నం

ఇరురాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత మోడీ ఇక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా ప్రభుత్వం రెండోసారి అధికారం చేపడితే రాజకీయ విశ్లేషకులు దాన్ని అద్భుత ఘనతగా చాటుతారని, కానీ గుజరాత్‌లో గత ముప్పై ఏళ్లుగా ఓ పార్టీ అనుపమాన విజయాలు సాధిస్తోందన్నారు. కానీ దాన్ని చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గుజరాత్‌లో బీజేపీ ఇలా

గుజరాత్‌లో బీజేపీ ఇలా

1990లో చిమన్‌భాయ్ పటేల్‌తో కలిసి తాము 90 సీట్లకు, ఆయన ఎక్కువ సీట్లకు పోటీ చేశారని, ఆయనకు 70 సీట్లు లభిస్తే తమకు 67 సీట్లు వచ్చాయని, అప్పట్లో తమ ప్రభుత్వాన్ని చీల్చి చిమన్‌భాయ్‌తో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, 1995లో తమకు 121 సీట్లు వచ్చాయని, తర్వాత వరుసగా 1998, 2002, 2007, 2012లో గెలిచామని,
అసమాన్య విజయం అందించిన అధ్యక్షులు అమిత్ షాకు అభినందనలు అని మోడీ అన్నారు.

English summary
Congress' Asha Patel has defeated, by a wide margin, sitting BJP lawmaker Narayanbhai Lalludas Patel of the BJP, from Unjha constituency which has Prime Minister Narendra Modi's home town, Vadnagar, according to Gujarat election result announced by the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X