గుజరాత్‌లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. 182 స్థానాలలో కనీసం 100 నుంచి 120 సీట్లు రావడం ఖాయమని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. ఒకటి రెండు సర్వేలు వందలోపు సీట్లు వచ్చినా గెలుపు ఖాయమని చెబుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేత ఒకరు తమ పార్టీ ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేత ఇలా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. గుజరాత్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయని, కానీ మా పార్టీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు.

 BJP won’t win enough seats to form govt in Gujarat: MP Sanjay Kakade

ఈ వ్యాఖ్యలు చేసింది బీజేపీ రాజ్యసభ సభ్యులు సంజయ్ కాకడే. ప్రచారంలో బీజేపీ ఉపయోగించిన మతతత్వమే ఓటమికి కారణం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 75 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు తాను చేసిన సర్వేలే తేలిందని చెప్పారు.

గుజరాత్‌లో ఓబీసీలు, ముస్లీంలు, పటేల్ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఓటమికి ఓ కారణమని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“According to a survey by my team, BJP will not get majority in Gujarat... This is based on a survey among voters in both rural and urban areas," said Sanjay Kakade.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి