వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎంపీగా విజయం సాధించిన విదేశాంగ మంత్రి జయశంకర్

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో జరిగిన రెండు రాజ్యసభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సభ్యులు విజయం సాధించారు. ముఖ్యంగా కేంద్ర విదేశాంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయశంకర్‌తో పాటు ఓబీసి నాయకుడు జుగల్ ఠాకూర్‌లు గుజరాత్ రాజ్యసభ స్థానం నుండి పోటి చేసి గెలుపోందారు. విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం విజయ్ రూపాని అభినందనలు తెలిపారు.

రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు

రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు

కాగా గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరాణిలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారి చేసింది. అయితే ఖాళీ రెండు స్థానాలకే ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారి చేయడం పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కేవలం రెండు స్థానాలకే ఎన్నికలే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రిం కోర్టులో కేసు వేసింది. అయితే నోటిఫికేషన్ వెలువడిన తర్వత కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలపై స్టే ఇవ్వలేమని సుప్రిం కోర్టు స్పష్టం చేసింది. దీంతో జూన్ 5 అయిదున ఎన్నికలు నిర్వహించడంతో రాష్ట్రం నుండి పోటి చేసిన ఇద్దరు బీజేపీ అభ్యర్థులు గెలుపోందారు.

తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

ఇక ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. తన పార్టీకి ఉన్న 65 మంది ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలించింది. అయినా కాంగ్రెస్ నేతలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్‌తో పాటు దావల్ జాలా అనే ఎమ్మెల్యేలు ఓటింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. దీంతో బీజేపీ సభ్యులు 104 ఓట్ల మెజారిటితో గెలుపోందారు.

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


కాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే అల్పశ్ పార్టీ పదవులన్నింటీకి రాజీనామ చేశాడు. కాని ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయలేదు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం తాను ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ మీద నమ్మకంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కాని పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ప్రకటించారు. ఈనేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ప్రజాధారణ ఉన్న పార్టీలకే తన మద్దతు ఉంటుందని ప్రకటించి బీజేపీకి ఓటు వేశానని చెప్పకనే చెప్పారు.

English summary
External Affairs Minister S Jaishankar and OBC leader Jugal Thakor secured victory in the Rajya Sabha bye-elections held on Friday, Gujarat Chief Minister Vijay Rupani announced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X