• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

85 ఏళ్ల వృద్ధురాలి మృతి: ఉలిక్కిపడ్డ మమత బెనర్జీ: పోలింగ్ వేళ..అమిత్ షా శాపాలు

|

కోల్‌కత: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. అందరి కళ్లూ పశ్చిమ బెంగాల్ పైనే నిలిచాయి. తొలిదశ పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తొలి విడతలో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతోన్నామంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. గురువారం జరిగే రెండో విడత పోలింగ్‌పై ఉత్కంఠత నెలకొంది.

వైసీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకేరోజు..ఒకేసారి: వైఎస్ జగన్ బాధ్యతలు..మంత్రుల భుజం మీద

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. అక్కడి ప్రచార కార్యక్రమాలు ఈ సాయంత్రంతో ముగియనున్నాయి. ఈ పరిస్థితుల మధ్య మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో పాదయాత్ర చేపట్టారు. ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు సాగే ఈ పాదయాత్రలో ఆమె వీల్ ఛైర్‌పై కూర్చుని పాల్గొంటున్నారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు.

BJP workers mother Shova Majumdar who was allegedly beaten by TMC dies

రెండో దశ పోలింగ్‌ కోసం సమాయాత్తమౌతెోన్న మమతా బెనర్జీకి ఊహించని అవాంతరం ఏర్పడింది. ఇదివరకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో దాడికి గురైనట్లు చెబుతోన్న 85 సంవత్సరాల వృద్ధురాలు షోవా మజుందార్ మరణించారు. ఓ సాధారణ బీజేపీ కార్యకర్త తల్లి ఆమె. నెలరోజుల కిందట ఆమెపై దాడి చేసి, తీవ్రంగా కొట్టారనే ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటోన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆమె మరణించారు. షోవా మజుందార్ మరణం కాస్తా రాజకీయ రంగును పులుముకుంటోంది. ఆమె మరణానికి మమతా బెనర్జీ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

షోవా మజుందార్ ఆత్మ.. మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్‌ను వెంటాడుతుందని అమిత్ షా శాపనార్థాలు పెట్టారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం అనుభవిస్తోన్న ఆవేదన సుదీర్ఘకాలం పాటు మమతా బెనర్జీని వెన్నాడుతుందని అన్నారు. షోవా మజుందార్ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట ఓ ట్వీట్ చేశారు. షోవా మజుందార్ మృతదేహం ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు.

English summary
Shova Majumdar, an 85-year-old woman, was in the headlines in the first week of March after she claimed she and her son, who was a BJP activist, were assaulted by TMC members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X