వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో టెన్షన్ టెన్షన్: బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణ, ఒకరి మృతి..

|
Google Oneindia TeluguNews

బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవ చల్లారడం లేదు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై దాడి అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే శనివారం బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. ఘర్షణలో 6 నుంచి ఏడుగురు గాయపడగా ఒకరు మృతిచెందారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉత్తర 24 పరగణ జిల్లా హలిషాహర్ వద్ద బీజేపీ శ్రేణులు గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారి గొడవ పడ్డారు. ఏడుగురు వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కల్యాణిలో గల జేఎన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులను మొహరించారు. ఘటనపై టీఎంసీ స్పందించింది. వ్యక్తిగత శత్రుత్వంలోనే దాడి జరిగిందని ఆరోపించింది. మరో రోజు.. మరో హత్య జరిగింది అని బీజేపీ నేత ఒకరు ట్వీట్ చేశారు.

BJP workers injured, 1 killed in clash in Halishahar

Recommended Video

Hyderabad : Bandi Sanjay Comments On CM KCR Delhi Tour

బెంగాల్‌లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ మరో స్టెప్ ముందుకు తీసుకుంది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్‌పై పంపాలని కోరింది.

నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న డైమండ్ హర్బర్ ఎస్పీ భోలానాథ్ పాండే, దక్షిణ బెంగాల్ ఏడీజీ రాజీవ్ మిశ్రా, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠీలను కేంద్ర సర్వీసులకు పంపాలని హోంశాఖ కోరింది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఈ ముగ్గురే దాడికి బాధ్యత వహించాలని కేంద్రం అంటోంది. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్‌కి సంబంధించి బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం అందజేశామని తెలిపింది. ఈ గొడవ జరుగుతుండగానే.. మరో వివాదం చెలరేగింది.

English summary
1 BJP worker was killed and several others injured at Halishahar in West Bengal's North 24 Paragana district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X