వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపిని నిర్భందించిన బిజెపి కార్యకర్తలు,మోడీ చరిష్మా కలిసొచ్చేనా,నోట్ల రద్దు దెబ్బేనా?

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య అసెంబ్లీ స్థానాన్ని బిఎస్ పి నుండి వచ్చిన గుప్తాకు కేటాయించడాన్ని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.ఫైజాబాద్ ఎంపి, స్థానిక నాయకులను బిజెపి కార్యకర్తలు అడ్డుక

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: పార్టీ ఫిరాయించినవారికి టిక్కెట్లను కేటాయించడంపై బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిఎస్ పి నుండి బిజెపిలో చేరిన వ్యక్తికి టిక్కెట్టు ఎలా కేటాయిస్తారంటూ బిజెపి కార్యకర్తలు ఎంపి, స్థానికులను నిర్భందించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అదికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా బరిలోకిదిగి అధికారాన్ని కైవసం చేసుకొంది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ పార్టీ పోటీచేస్తోంది.

ఈ దఫా బిఎస్ పి, బిజెపిలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా ప్రధాన పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి.

బిజెపి నాయకులను కట్టేసిన కార్యకర్తలు

బిజెపి నాయకులను కట్టేసిన కార్యకర్తలు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఒంటరిగా పోటీచేస్తోంది.ఈ దఫా అధికారంలోకి రావాలని ఆ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.అయితే గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు ఆ పార్టీకి నెలకొన్నాయి. దరిమిలా బిఎస్ పి నుండి బిజెపిలో చేరిన గుప్తాకు కేటాయించారు.దీంతో ఫైజాబాద్ ఎంపి ల్లూ సింగ్, స్థానిక బిజెపి నాయకుడు అవదేష్ పాండేను బిజెపి కార్యకర్తలు నిర్భంధించారు.స్థానిక నాయకులకే టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 మోడీ చరిష్మా కలిసివచ్చేనా?

మోడీ చరిష్మా కలిసివచ్చేనా?


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి మోడీ పోటీ చేయడం ద్వారా దాని ప్రభావం ఆ రాష్ట్రంపై ఉంటుందని బిజెపి వ్యూహత్మకంగా వ్యవహరించింది.దీంతో ఈ రాష్ట్రంలోని 80 పార్లమెంట్ సీట్లలో 73 సీట్లను ఆ పార్టీ దక్కించుకొంది. అయితే 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతాయని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బిజెపి విజయం సాధించింది.

 నోట్ల రద్దు ప్రభావం చూపేనా?

నోట్ల రద్దు ప్రభావం చూపేనా?

నల్ల దనం నిర్మూలించేందుకుగాను పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన ఈ నిర్ణయం తీసుకొంది. అయితే కొత్త కరెన్సీ నగదు నోట్లు రద్దుచేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. కాని, వ్యాపారులు, ధనవంతులు నగదు కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదు. సామాన్యులు మాత్రం కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడ్డారు. ఈ ఎన్నికల్లో ఈ అంశాన్ని సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. ఈ అంశాన్ని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇదివరకు ప్రకటించారు.

 ఆర్ ఎస్ ఎస్ వ్యూహం బిజెపికి లాభించేనా?

ఆర్ ఎస్ ఎస్ వ్యూహం బిజెపికి లాభించేనా?

ఈ దఫా ఎన్నికల్లో బిజెపికి ప్రయోజనం కల్గించేలా రెండు ఏళ్ళుగా ఆర్ ఎస్ ఎస్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.దళితులు, బిసిల ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఆర్ఎస్ ఎస్ పథకం ప్రకారం పనిచేస్తోంది. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆర్ ఎస్ ఎస్ పనిచేస్తోంది. మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.మరో వైపు మద్యం తాగకుండా ప్రజలను మాన్పించే ప్రయత్నాల్లో ఆర్ఎస్ ఎస్ సక్సెస్ అయింది.

 ఫిరాయింపు దారులకు టిక్కెట్లు కేటాయించడం సరికాదు

ఫిరాయింపు దారులకు టిక్కెట్లు కేటాయించడం సరికాదు

వ్యతిరేకత కారణమో, పార్టీల పొత్తులు కారణమో, పార్టీ టిక్కెట్టు దక్కని నాయకులు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.ఇంత కాలంపాటు పార్టీని నమ్ముకొన్నవారికి టిక్కెట్టు ఇవ్వకుండా పక్కపార్టీ నుండి జంప్ చేసిన వారికి టిక్కెట్టు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు సాగిస్తున్నారు. అయోధ్య టిక్కెట్టును బిఎస్ పి నుండి వచ్చిన వారికి కేటాయించడంపై బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బిఎస్ పి నుండి బహిష్కరణకు గురైన ఓ ఎంఏల్ఏ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కే అవకాశం కన్పిస్తోంది.

English summary
bjp workers protest agianst fizabad mp in uttarpradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X