వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధ్వీ వ్యాఖ్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫైర్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు...

|
Google Oneindia TeluguNews

భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమే ఆలా మాట్లాడకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. మరోవైపు సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు రావడం పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆమేకు నోటీసులు పంపారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత సాధ్వీ ఆదివారం తన నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు ,పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు. ఈనేపథ్యంలోనే ఓ కార్యకర్త తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను సాధ్వీ దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతంలో లావెట్రీలు,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పిర్యాధు చేశారు. దీంతో స్పందించిన ఆమే తాను లావేట్రిలు, డ్రైనేజీలే క్లీన్ చేసేందుకు ఎంపీగా కాలేదని అన్నారు.మేమున్నది మురికి కాలువలు మరుగుదోడ్లు క్లీన్ చేసేందుకు కాదని చెప్పారు. మేము ఎందుకు ఎన్నికయ్యామో ఆ పనులను నిజాయితీగా చేసి చూపిస్తామని చెప్పారు. దయచేసి అర్థం చేసుకోండి, నేను చేసే పని వేరే ఉంది దాన్ని పూర్తి చేస్తాను, ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను, మళ్లి చెబుతున్నాను అని తేల్చి చెప్పింది.

BJP working president JP Nadda has expressed his displeasure over Sadhvi Pragyas statement

ఈ వివాదంపై సాధ్వీ స్పందించారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్నే చూపించి కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ప్రధాని స్వచ్ఛ భారత్‌ పథకం విజయవంతం చేయడానికి కృషి చేస్తానన్నారు.

English summary
BJP working president JP Nadda has expressed his displeasure over Sadhvi Pragya's Controversial statement and advised her to refrain from making such comments.that she has not been elected to clean toilets or sweep floors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X