వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో కొకైన్‌తో పట్టుబడిన బిజెపి యువ మహిళా నేత పమేలా గోస్వామి .. హైడ్రామా మధ్య అరెస్ట్

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ మహిళా నేతను కోల్ కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ నేత కారులో వంద గ్రాముల కొకైన్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు . ఆమెతో పాటు అదే పార్టీకి చెందిన మరో నేత ప్రోబిర్ కుమార్ డే ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బిజెపి యువనేతను పమేలా గోస్వామి గా గుర్తించారు పోలీసులు.

 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేస్తా .. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారికి మమతాబెనర్జీ షాక్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేస్తా .. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారికి మమతాబెనర్జీ షాక్

కొకైన్ తరలిస్తూ పట్టుబడిన బీజేపీ యువ నేత పమేలా గోస్వామి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొకైన్ తరలిస్తూ పట్టుబడిన బీజేపీ యువ నేత పమేలా గోస్వామి, అరెస్ట్ చేసిన పోలీసులు

నాటకీయ పరిణామాల మధ్య , బెంగాల్ బిజెపి ప్రధాన కార్యదర్శి పమేలా గోస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె పర్సులో దొరికిన కొన్ని లక్షల విలువైన కొకైన్ ను , అలాగే ఆమె ఉన్న కారు సీటు కింద ఉన్న కొకైన్ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. యువ మోర్చాలో ఆమె స్నేహితుడు మరియు సహోద్యోగి - ప్రబీర్ కుమార్ డే కూడా అదే కారులో ఉండటంతో అరెస్టు చేశారు. ఈ సంఘటన తెల్లవారుజామున న్యూ అలీపోర్ ప్రాంతంలో జరిగింది.

ఎన్ఆర్ అవెన్యూలోపట్టుకున్న పోలీసులు , బీజేపీ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్ఆర్ అవెన్యూలోపట్టుకున్న పోలీసులు , బీజేపీ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు


ఎంఎస్ గోస్వామి మరియు ఆమె సహచరుడు ఎన్ఆర్ అవెన్యూలోని ఒక కేఫ్ కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పమేలా గోస్వామికి కేటాయించిన సెక్యూరిటీ గార్డును కూడా కారులో ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు. బిజెపికి చెందిన సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ, కొకైన్‌ను కారులో ఎవరో పెట్టారో ? తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు రాష్ట్ర నియంత్రణలో ఉన్నారు. ఏదైనా జరగవచ్చు అని, కావాలనే ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు .

బీజేపీ నాయకుల నిజ చరిత్ర ఇదే .. మండిపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు

బీజేపీ నాయకుల నిజ చరిత్ర ఇదే .. మండిపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు

తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ, "బెంగాల్‌లో ఇలాంటి ఘటనలు జరగడంపై తాను సిగ్గుపడుతున్నానని అన్నారు . బెంగాల్‌లో బిజెపి నిజ స్వరూపం ఇదేనని వ్యాఖ్యానించారు. అంతకుముందు, కొంతమంది బిజెపి నాయకులు పిల్లల అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డారని, ఇప్పుడు మాదక ద్రవ్యాల రవాణా కేసులో పట్టుబడుతున్నారని వ్యాఖ్యానించారు.

కేఫ్ వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు , కొకైన్ దొరికిందన్న పోలీసులు

కేఫ్ వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు , కొకైన్ దొరికిందన్న పోలీసులు


పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పమేలా గోస్వామి మరియు ప్రబీర్ ఒక కేఫ్‌ను పదేపదే సందర్శించడం, ఆపి ఉంచిన కారులో కూర్చోవడం మరియు మోటారు సైకిళ్లపై వస్తున్న యువకులతో లావాదేవీలు జరపడం వంటివి గుర్తించడంతో అనుమానం వచ్చి పరిశీలించామని దీంతో ఆమె వద్ద కొకైన్ లభించిందని వారు చెప్తున్నారు .

బీజేపీలో చేరటానికి ముందే నటీమణి గా , మోడల్ గా పని చేసిన పమేలా గోస్వామి

బీజేపీలో చేరటానికి ముందే నటీమణి గా , మోడల్ గా పని చేసిన పమేలా గోస్వామి

పమేలా గోస్వామి 2019 లో బిజెపిలో చేరడానికి ముందు ఎయిర్ హోస్టెస్, మోడల్ మరియు టివి సీరియల్ నటీమణి గా పనిచేసినట్లు తెలుస్తుంది . తరువాత ఆమెను యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మరియు హుగ్లీ జిల్లాకు యువ మోర్చా పరిశీలకుడిగా నియమించారు. ప్రస్తుతం ఆమె అరెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ సంఘటన బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది .

English summary
A BJP youth leader was arrested Friday evening in Bengal's Kolkata for allegedly carrying 100 gm cocaine. In dramatic developments, Pamela Goswami, General Secretary of Bengal BJP Yuva Morcha, was arrested for possession of cocaine worth a few lakhs found in her purse and under the seat of the car she was in. Her friend and colleague in the Yuva Morcha - Prabir Kumar Dey - who was in the car was also arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X