వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఎంపి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోకసభ సభ్యుడు నానా పటోలే తన రాజీనామాపై పెదవి విప్పారు. ఆయన మహారాష్ట్రలోని గోండియా నియోజకవర్గంనుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం నుంచే ఆయన రాజీనామా అమలులోకి వస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి

తన రాజీనామాను సమర్పిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీలపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.

BJPmp resigns, mp nana patole resigns

తాను రాజీనామా చేయడానికి 14 కారణాలను చూపుతూ ఆయన లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. బిజెపి తిరుగుబాటు ఎంపి అయిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వం మీద బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

ఆయన అక్టోబర్‌లో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాకరేను కలిశారు. తాను ఎప్పటికప్పుడు ప్రధానికి సమస్యలను వినిపిస్తున్నప్పటికీ పట్టించకోవడం లేదని ఆయన అన్నారు.

English summary
BJP has come out in the open after its member of Parliament from Gondia in Maharashtra Nana Patole resigned from the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X