వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో మరో మహమ్మారి విలయం -మ్యూకర్‌మైకోసిస్‌ వ్యాధితో 9 మంది మృతి - గుజరాత్‌, ఢిల్లీలో కల్లోలం

|
Google Oneindia TeluguNews

గడిచిన 13 నెలలుగా కరోనా విలయం గజగజ లాడిస్తుండగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1కోటికి, మరణాల సంఖ్య 1.5లక్షలకు చేరువయ్యాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటం, కొవిడ్ వ్యాధిని నియంత్రించేలా ఒకటి రెండు వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్నవేళ దేశంలో మరో అలజడి రగులుకుంది. వైద్య పరిభాషలో అరుదైన వ్యాధిగా భావించే 'బ్లాక్ ఫంగల్' ఇప్పటికే పదుల మందిని పొట్టనపెట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

గుజరాత్‌లో కల్లోలం రేపుతున్న ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగల్.. ఢిల్లీ, ముంబైకి కూడా..!

పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతిపిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి

గుజరాత్‌లో కల్లోలం

గుజరాత్‌లో కల్లోలం

కరోనా నుంచి పూర్తిగా కోలుకోకముందే.. గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. ‘బ్లాక్ ఫంగల్'గా పిలిచే మ్యూకర్‌మైకోసిస్‌ (Mucormycosis) అనే అరుదైన వ్యాధి.. అహ్మదాబాద్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ నగరంలో ఇప్పటికే 44 మందికి ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్ లోని పలు నగరాల్లోనూ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది..

ఢిల్లీ, ముంబైకి కూడా వ్యాపించింది..

ఢిల్లీ, ముంబైకి కూడా వ్యాపించింది..

గుజరాత్ లో మ్యూకర్‌మైకోసిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య, దాని బారినపడి చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోని ఇతర ప్రాంతాలకూ ఇది వ్యాపించే అవకాశముందని హెచ్చరించేలోపే.. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలకు పాకిపోయింది. ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో చేరారు. ఇతర ప్రాంతాలకూ ఈ వ్యాధి వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మ్యూకర్‌మైకోసిస్‌ అంటే?

మ్యూకర్‌మైకోసిస్‌ అంటే?

డాక్టర్లు, సైంటిస్టులు ‘బ్లాక్ ఫంగల్'గా పిలిచే మ్యూకర్‌మైకోసిస్‌ ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. గతంలో దీనిని జైగోమైకోసిస్ (zygomycosis) అని పిలిచేవారు. ఇది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యూకర్‌మైకోసెట్స్(mucormycetes) అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది సంక్రమిస్తుంది. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం..

పోలీస్ దంపతుల దారుణ హత్య -ప్రియుడితో కలిసి మైనర్ కూతురి ఘాతుకం -ఊరొదిలి పరార్పోలీస్ దంపతుల దారుణ హత్య -ప్రియుడితో కలిసి మైనర్ కూతురి ఘాతుకం -ఊరొదిలి పరార్

చూపు కోల్పోయి.. మజ్జ రోగం..

చూపు కోల్పోయి.. మజ్జ రోగం..


మ్యూకర్‌మైకోసిస్‌.. మ్యూకర్మోసైట్స్‌ మోల్డ్స్‌(అచ్చులు) కారణంగా కలిగే అరుదైన, ప్రమాదకర ఫంగల్‌ ఇనెక్షన్‌. మ్యూకర్మోసైట్స్‌ మోల్డ్స్‌ పర్యావరణం అంతటా ఉంటాయి. వీటి ద్వారా ఇన్ఫెక్షన్‌ ముక్కు నుంచి ప్రారంభమై కళ్లకు వ్యాపిస్తుంది. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వానికి కారణమవుతుంది. ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటి్‌స(మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

బ్లాక్ ఫంగల్ ఎలా వ్యాపిస్తుంది?

బ్లాక్ ఫంగల్ ఎలా వ్యాపిస్తుంది?


అతి తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యూకర్‌మైకోసిస్‌.. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ గా మొదలవుతుంది. అక్కడి నుంచి కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు. వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా.. ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అజాగ్రత్త వహించినా.. ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై మ్యూకర్‌మైకోసిస్‌ కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుంది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

మ్యూకర్‌మైకోసిస్‌ కట్టడి ఎలా?

మ్యూకర్‌మైకోసిస్‌ కట్టడి ఎలా?

ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యూకర్‌మైకోసిస్‌ ను కట్టడి చేయడానికి వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని చెబుతున్నారు. ముక్కు, కంటిని చేతులతో తాకకుండా జాగ్రత్తపడాలని, ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. మ్యూకర్‌మైకోసిస్‌ ను ప్రారంభదశలో గుర్తిస్తే త్వరగా బయటపడవచ్చని లేదంటే ప్రాణామమీదికి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
Even as the coronavirus pandemic looms over India, another deadly disease outbreak has alerted authorities. Mucormycosis, a rare but deadly fungal disease, has been making news, with cases coming up in Delhi, Mumbai and Ahmedabad in Gujarat. According to a report in India Today, out of the 44 recent cases of mucormycosis in Ahmedabad, nine patients died. The infection has also resulted in eyesight loss for some people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X