• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వింత: యువతి మృతదేహంతో పూజలు, మంత్రులు ,రాజకీయ నాయకులు కూడ ఇలా....

By Narsimha
|

చెన్నై:మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా వారి కోర్కెలను తెలుసుకొని పరిహరాలను చేయిస్తానని నమ్మించేవాడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తికేయన్.అయితే ఇటీవలే జైలుకు వెళ్ళి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.ఓ యువతి మృతదేహంతో పూజలు నిర్వహిస్తుండగా పోలీసులు అతణ్ణి అరెస్టు చేశారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వచ్చినా మానవుడు మూఢనమ్మకాలను వీడడం లేదు. మంత్రాలు, ఆత్మలతో మాట్లాడడం లాంటి వాటిని నమ్మి మోసపోతూనే ఉన్నారు.

కోర్కెలు తీరకుండానే చనిపోతే వారి ఆత్మలు అలాగే తిరుగుతుంటాయనే చెప్పి పబ్బం గడుపుకోవడం తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తికేయన్ కు అలవాటుగా మారింది.

మనిషి బలహీనతను ఆసరాగా చేసుకొని పూజలు, మంత్రాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే ఆయన మాటలు విని పెద్ద సంఖ్యలనే ఆయన వద్దకు జనం పూజలకోసం వస్తుంటారు.

ఎవరీ కార్తికేయన్

ఎవరీ కార్తికేయన్

తమిళనాడు రాష్ట్రంలోని పెరంబలూరులోని మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళే దారిలోని ఎంఎం నగర్ లోని శెట్టికుళం గ్రామానికి చెందిన శరవణన్ రెండంతస్థుల భవనం ఉంది.

ఈ భవనంలో పెరంబలూరు కళ్యాణ్ నగర్ కు చెందిన కార్తికేయన్ అద్దెకు ఉండేవాడు. ఈ భవనానికి నెలకు రూ.20 వేల రూపాయాలను చెల్లించేవాడు. మూడేళ్ళుగా ఇదే భవనంలో ఆయన తన భార్య, ఇద్దరు సహయకులతో నివాసం ఉంటున్నాడు.

మనిషి బలహీనతలను సొమ్ముచేసుకొనే కార్తికేయన్

మనిషి బలహీనతలను సొమ్ముచేసుకొనే కార్తికేయన్

చేతబడి, వశీకరణ పేరుతో మనుషుల బలహీనతలను కార్తికేయన్ సొమ్ముచేసుకొనేవాడు.అంతేకాదు ఏదో పూజలు చేసి వారి నుండి పెద్ద ఎత్తున డబ్బులను గుంజేవాడు.

ఆయన ఇంట్లో ఎప్పుడూ మృతదేహలు ఉండేవి.అంతేకాదు మనిషి పుర్రెలు ఇతర వస్తువులు ఇంటి నుండి ఉడేవి.కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహల మద్యే వారు అదే ఇంట్లో జీవనం సాగించేవారు.

మాజీమంత్రులు, మంత్రులు కూడ కార్తికేయన్ కస్టమర్లే

మాజీమంత్రులు, మంత్రులు కూడ కార్తికేయన్ కస్టమర్లే

పెరంబులూరులో ఉంటున్న కార్తికేయన్ వద్దకు పూజల నిమిత్తం మంత్రులు, మాజీ మంత్రులు వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు

.అంతేకాదు పోలీసుల విచారణలో కూడ కార్తికేయన్ ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు. పుదుచ్చేరికి చెందిన మంత్రులు, మాజీ మంత్రులు రాజకీయ నాయకులు తన వద్దకు వచ్చేవారని ఆయన పోలీసులకు విచారణ నిమిత్తం చెప్పారు.

ఓ ఫోన్ కాల్ కార్తికేయన్ ను పట్టించింది

ఓ ఫోన్ కాల్ కార్తికేయన్ ను పట్టించింది

శుక్రవారం నాడు సాయంత్రం పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి నుండి ఓ ఫోన్ సమాచారం వచ్చింది. ఈ ఫోన సమాచారం ఆధారంగా పెరంబలూరు ఎస్ పి నేతృత్వంలో పోలీసులు కార్తికేయన్ ఇంటిపై దాడి చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం వాస్తవమేనని పోలీసులు నిర్థారించారు.ఓ గదిలో ఉన్న శవపేటీకలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న యువతి మృతదేహం ఉంది. ఈ శవపేటిక పక్కనే 20కి పైగా మానవ పుర్రెలున్నాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు దొరికాయి. ఇతర గదుల్లో పూజా సామాగ్రి చిందర వందరగా పడి ఉంది.

చనిపోయిన వారి కోర్కెలను తెలుసుకొనే మార్గం

చనిపోయిన వారి కోర్కెలను తెలుసుకొనే మార్గం

దయ్యాలతో సంబంధం ఉండే ఆఘోర పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా కార్తికేయన్ పోలీసులకు చెప్పాడు.

అర్థరాత్రి వేళలో తన వద్దకు వచ్చేవారి కోసం పూజలు నిర్వహించనున్నట్టు చెప్పారు. చనిపోయిన వ్యక్తుల కోర్కెలను తెలుసుకొంటానని చెప్పాడు.కోర్కెల తీరకుండానే చనిపోతే ఆత్మల చెప్పిన వివరాలను వారి బంధువుల దృష్టికి తీసుకెళ్ళి పరిహరం చేయిస్తానని చెప్పి డబ్బులు తీసుకొంటానని పోలీసులకు వివరించాడు.

నరబలి ఆరోపణలు ఎదుర్కొన్న కార్తికేయన్

నరబలి ఆరోపణలు ఎదుర్కొన్న కార్తికేయన్

మంత్రాలు చేసేందుకుగాను ఓ చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణలపై కార్తికేయన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆయన బెయిల్ పై వచ్చాడు.

బెయిల్ పై వచ్చినా ఆయన తన పనులు మానలేదు.అయితే కార్తికేయన్ ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న యువతి మృతదేహన్నిపోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపారు. కార్తికేయన్ తో పాటు ఆయన భార్య నశీమాబాను మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Acting on complaints from the public, who grew suspicious after foul smell emanated from a house at MM Nagar near Perambalur Municipality, a team of the Perambalur town police rushed to the spot and conducted a search on the house belonging to S Karthick (31) and his wife Deepika alias Nazeema (22), during which it found a woman’s body in a wooden box. During inquiries, Karthick admitted that he was practicing black magic for more than three years at the rented house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more