వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లధనం: అనుమానిత లిస్ట్‌లో ఇండోర్ టెక్స్‌టైల్ సంస్థ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెర్న్: విదేశాల్లోని నల్లధనం ఖాతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నల్లధనం కలిగి ఉన్నారనే అనుమానాలు ఉన్న వారి పైన ట్యాక్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణ చేస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కంపెనీ జాబితాలో చేరింది.

స్విట్జర్లాండుకు చెందిన అధికారులు మాట్లాడుతూ... ఇండోర్ బేస్డ్ టెక్స్‌టైల్ ఫర్మ్‌కు చెందిన సమాచారం ఇవ్వాలని తమకు విజ్ఞప్తి వచ్చిందని చెప్పింది. ఆ టెక్స్ టైల్ సస్థ నియో కార్ప్.

Black Money

తద్వారా విదేశాల్లో దాచిన నల్లధనం పైన భారత అధికారులు కొనసాగిస్తున్న వేటకు సహకరిస్తున్న స్విట్జర్లాండు ప్రభుత్వం తాజాగా కొత్త పేరు బయటకు తెచ్చింది. నియో కార్ప్ సంస్థను అనుమానిత కంపెనీగా తమ వెబ్ సైట్లో కూడా స్విట్జర్లాండు ఉంచింది.

భారత అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ సంస్థకు చెందిన సమాచారాన్ని అందజేసినట్లు పేర్కొంది. నియో కార్ప్ సంస్థకు అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది.

1985లో చిన్న గోనె సంచుల తయారీ పరిశ్రమగా వ్యాపారాన్ని ప్రారంభించిన నియో కార్ప్ ... ఇప్పుడు మల్టీ నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ గ్రూపుగా చెప్పుకుంటోంది. పన్ను ఎగవేత ఆరోపణల పైన ఫిబ్రవరిలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

English summary
In a fresh disclosure on suspected black money cases being probed by tax authorities in India, Switzerland today said it has received request for information about Indore-based textiles firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X