వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బార్ డ్యాన్సర్ గుప్పిట్లో ఇరుక్కున్న వ్యాపారి, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్, అక్క చేసిందని చెల్లి కూడా!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : ఓ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.27.5 లక్షలు దోచుకున్న దారుణ ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన నరేష్ కింజి నందా (31) అనే వ్యాపారి ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నాడు.

నడిరోడ్డుపై కీచక పర్వం, విద్యార్థినిని చుట్టుముట్టి.. వేధిస్తూ.. వీడియో తీసి...నడిరోడ్డుపై కీచక పర్వం, విద్యార్థినిని చుట్టుముట్టి.. వేధిస్తూ.. వీడియో తీసి...

నందాకు పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నందా తరచూ వ్యాపారం పనిమీద ముంబైకి వెళుతుంటాడు. అక్కడి బేలాపూర్ ప్రాంతంలోని మాయా డ్యాన్స్ బార్ కు వెళ్లినపుడు అక్కడ సోనాలీకపూర్ అనే బార్ డ్యాన్సర్‌తో అతడికి పరిచయం ఏర్పడింది.

Blackmailed by Bar Dancer, Businessman Loses Rs.27.5 Lakh

ఆ పరిచయంతో నందా తరచూ సోనాలిని కలుస్తుండే వాడు. అది సాకుగా తీసుకున్న సోనాలీ నందాకు చెందిన లగ్జరీ కారును తీసుకొని రూ.9.50 లక్షల చెక్కు ఇచ్చింది. ఆ చెక్కు బౌన్స్ కావడంతో నందా సోనాలీకి నోటీసు పంపించాడు.

అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు! చేయించింది టీడీపీ నేతలు!?అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు! చేయించింది టీడీపీ నేతలు!?

దీంతో తనకు మరో రూ.15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే నందా తనతో గడిపిన ఫోటోలను బయటపెడతాంటూ సోనాలీ బెదిరించింది. ఆ బెదిరింపుకు భయపడిన నందా సోనాలీని అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లి ఆమె అడిగిన డబ్బు ఇచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న సోనాలి చెల్లెలు హీనా కూడా అతడిని బెదిరించింది. తనకూ డబ్బులివ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని నందాను బ్లాక్ మెయిల్ చేసింది. హీనాతోపాటు షమ్ము అనే మరో వ్యక్తి కూడా నందాను బెదిరించాడు.

దీంతో ఇక లాభం లేదనుకుని నందా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై పోలీసులు సోనాలీ, హీనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బార్ డ్యాన్సర్ వెనుక పెద్ద ముఠా హస్తముండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A Vapi-based businessman was allegedly blackmailed into parting with Rs 27.5 lakh by a Mumbai bar dancer whom he had befriended three years ago. While he initially gave in, it was only when her sister too started demanding money that he approached the police. Naresh Khinji Nanda (31) is into furniture business in Vapi. He is married and has two children. According to his complaint, Nanda regularly visited Mumbai for business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X