చెన్నై రైల్వే స్టేషన్లో పేలుడు: గుంటూరు మహిళ మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలినట్లు సమాచారం అందుతోంది. బాంబు పేలుళ్లతో చెన్నై రైల్వే స్టేషన్ దద్ధరిల్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. చెన్నై రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబర్ ఫ్లాట్‌ఫారంపై గురువారం ఉదయం 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జంట పేలుళ్లు సంభవించాయి.

బాంబు పేలుళ్లతో పది మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు సంభవించిన సమయంలో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాట్ పారంపై ఆగి ఉంది. బాంబు పేలిన సమయంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను అధికారులు ఖాలీ చేయిస్తున్నారు. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుడుతో తాత్కాలికంగా రైలు సర్వీసులను నిలిపేశారు. రైల్వే స్షేషన్‌లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. గాయపడినవారిని చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన స్వాతిగా గుర్తించారు. పేలుడు ప్రభావానికి గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్ - 5, ఎస్ -6 ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు వెనక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర మార్గంలో చెన్నైకి చేరుకున్న ఉగ్రవాదులు బాంబు దాడులకు కుట్ర చేసినట్లు భావిస్తున్నారు. చెన్నైలో ఐఎస్ఐ తీవ్రవాది జాకీర్ హుస్సేన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతను వెల్లడించిన అంశాలతో పోలీసులు తనిఖీలు కూడా చెపట్టారు.
పలు చోట్ల ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు జకీర్ విచారణలో చెప్పినట్లు సమాచారం. దాంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి శ్రీలంక మీదుగా భారత్‌లోకి అడుగు పెట్టినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications